Broom: చీపురు విషయంలో అలాంటి నియమాలు పాటించకపోతే దురదృష్టం పట్టిపీడించడం ఖాయం?

మామూలుగా హిందువులు చీపురుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. అందుకే చీపురుని కాలుతో తన్నడం లాంటివి చేయరు. లక్ష్మీదేవికి సంబంధించిన వస

  • Written By:
  • Publish Date - December 14, 2023 / 08:00 PM IST

మామూలుగా హిందువులు చీపురుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. అందుకే చీపురుని కాలుతో తన్నడం లాంటివి చేయరు. లక్ష్మీదేవికి సంబంధించిన వస్తువులలో చీపురు కూడా ఒకటి. అయితే ఈ చీపురు విషయంలో తెలిసి తెలియక కూడా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు. అలాగే కొన్ని రకాల నియమాలను పాటించడం తప్పనిసరి. మరి చీపురు విషయంలో ఎలాంటి నియమాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత చీపురు వినియోగించకూడదు. సూర్యోదయం తర్వాత, సూర్యాస్తమయానికి ముందే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి.

చీకటి పడిన తర్వాత ఇంటిని ఊడిస్తే లక్ష్మీదేవి కోపగించుకుంటుంది. ఫలితంగా అలాంటి ఇళ్లలో దరిద్రం తాండవమాడుతుంది. అందుకే సూర్యాస్తమయానికి ముందే ఇల్లు శుభ్రం చేసుకోవాలి. అలాగే ఎవరైనా ఏదైనా పనిమీద ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు వారు అలా వెళ్లిన వెంటనే చీపురుతో ఇంటిని తుడవకూడదు. అలా చీపురుతో ఇంటిని శుభ్రం చేయడం వల్ల వారు వెళ్లిన పని జరగదట. ముఖ్యంగా బయటికి వెళ్లే వారు వాళ్ల గది నుంచి బయటికి వచ్చిన తర్వాత చీపురు అసలు వాడకూడదు. బయటి వ్యక్తుల చూపు పడని చోట చీపురు దాచి ఉంచాలి. తులసి కోట, పూజగది, డబ్బుదాచే చోట చీపురు ఉంచకూడదు. చీపురు వీటికి దగ్గరగా పెడితే ఇంట్లోకి రావల్సిన ధనం రాదు.

చీపురును ఎప్పుడూ కాలితో తన్నకూడదు. పొరపాటున కాలు తగిలిన చేతులు జోడించి క్షమాపణ అడగాలి. చీపురు ఇంట్లో వాయవ్యంలో లేదా పడమర దిక్కున దాచి ఉంచాలి. ఈశాన్యం, ఆగ్నేయంలో చీపురును ఉంచకూడదు. ఇల్లు ఊడ్చే సమయంలో శివాయ నమ: అని భగవన్నామ స్మరణతో ప్రారంభిస్తే శనేశ్చరుడు ఇంట్లో నుంచి వెళ్లిపోతాడని నమ్మకం. అలాగే చీపురు పాత బడిందని మనం కొన్నిసార్లు బయట పారేస్తూ ఉంటాం. అలా చీపురుపారేషే విషయంలో కొత్త చీపురుని ఇంటికి తెచ్చుకునే విషయంలో కూడా కొన్ని రకాల విషయాలు పాటించడం తప్పనిసరి. పాత చీపురు తీసేసి కొత్త చీపురు వాడడానికి శనివారం మంచిది. కృష్ణ పక్షంలో చీపురు కొనడం మంచిది. మంగళ వారం, శుక్రవారం, మహాలయ పక్షం అంటే భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉండే రోజుల్లో కొత్త చీపురు కొని ఇంటికి తీసుకురావద్దు. అలాగే పండగ రోజుల్లో, ఇంట్లో ఎవరిదైనా పుట్టిన రోజున ఇంట్లోని పాత చీపురు బయట పడెయ్యకూడదు. రోహిణి నక్షత్రం, హస్త నక్షత్రం, పుష్యమి, ఉత్తరాభాద్ర, అనురాధ నక్షత్రాలు వచ్చిన రోజుల్లో కూడా చీపురు కొన కూడదు. పాత చీపురు తీసెయ్య కూడదు. సోమవారం, బుధవారం, గురువారం, ఆదివారం మాతరమే పడెయ్యాలి.