Site icon HashtagU Telugu

Rudraksha Mala: రుద్రాక్షలను ధరిస్తున్నారా.. ఈ తప్పులు చేశారంటే ఇక అంతే సంగతులు?

Rudraksha Mala

Rudraksha Mala

చాలామంది మెడలో రుద్రాక్షలను ధరిస్తూ ఉంటారు. కొందరు కేవలం ఒక రుద్రాక్షను మాత్రమే ధరిస్తే ఇంకొందరు ఏకంగా రుద్రాక్ష మాలలను ధరిస్తూ ఉంటారు. రుద్రాక్ష ఆ పరమశివుడికి ఎంతో ప్రీతికరమైనది అన్న విషయం తెలిసిందే. రుద్రాక్షలను శివుడికి ప్రతిరూపంగా కూడా భావిస్తూ ఉంటారు. రుద్రాక్షలను ధరించడం వల్ల అపరమశివుని ఆశీస్సులు ఉండడంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని విశ్వసిస్తూ ఉంటారు. అయితే రుద్రాక్షలను ధరించడం మంచిదే కానీ రుద్రాక్షలను ధరించినప్పుడు కొన్ని రకాల నియమాలను తప్పకుండా పాటించాలి.

మరి రుద్రాక్షను ధరించినప్పుడు ఎటువంటి విషయాలను ఎటువంటి నియమాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రాత్రి సమయంలో నిద్రపోయే ముందు రుద్రాక్షను తప్పకుండా తీసి పక్కన పెట్టి నిద్రపోవాలి. రుద్రాక్షను మెడలో అలాగే ధరించి నిద్రించడం వల్ల అది అపవిత్రం అవుతుంది. నిద్రపోయే ముందుగా ఆ రుద్రాక్షలను తీసివేసి మళ్లీ ఉదయాన్నే స్నానం చేసి వాటిని ధరించాలి. అలాగే రుద్రాక్షలను ధరించే వారు మాంసం, మధ్యం సేవించకూడదు. ఎందుకంటే రుద్రాక్ష ఎంతో పరమ పవిత్రమైనది. రుద్రాక్షను శివుని ఒక ప్రతీకగా భావిస్తారు.

కాబట్టి రుద్రాక్షలను ధరించి అటువంటి పనులు చేయకూడదు. అలాగే చాలామంది అప్పుడే పుట్టిన శిశువుకు రుద్రాక్షను వేస్తూ ఉంటారు. కానీ ఆ విధంగా చేయకూడదు. ఎందుకంటే శిశువు పుట్టిన తర్వాత కొన్ని రోజుల వరకు మైల రోజులు. బిడ్డ పుట్టిన వెంటనే బిడ్డకు లేదా తల్లికి రుద్రాక్షను వేయకూడదు. ఇలాంటి నియమాలను పాటించడంతోపాటుగా రుద్రాక్షను ధరించేవారు వారి రాశి ప్రకారం ఎటువంటి రుద్రాక్షలను ధరించాలో వాటిని తెలుసుకొని ధరించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలను పొందవచ్చు. రుద్రాక్షలను ధరించడం వల్ల సుఖసంతోషాలు అదృష్టం అనుకున్న పనులు నెరవేరుతాయి.