Rudraksha: ఏ రుద్రాక్ష ధరిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో మీకు తెలుసా?

సాధారణంగా ఆలయంలో పూజలు చేసేవారు అలాగే సామాన్య వ్యక్తులు కూడా రుద్రాక్షలను ధరిస్తూ ఉంటాడు. రుద్రాక్ష అంటే ఏమిటి అన్న విషయానికి వస్తే. రుద్ర అ

  • Written By:
  • Publish Date - June 7, 2023 / 09:40 PM IST

సాధారణంగా ఆలయంలో పూజలు చేసేవారు అలాగే సామాన్య వ్యక్తులు కూడా రుద్రాక్షలను ధరిస్తూ ఉంటాడు. రుద్రాక్ష అంటే ఏమిటి అన్న విషయానికి వస్తే. రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కన్నీరు. రుద్రాక్షలు అనేవి శివుని కంటి నుంచి జాలువారిన బిందువులు. అయితే చాలామంది ఏవి పడితే వాటిని ధరిస్తూ ఉంటారు. కానీ అలా ధరించకూడదు. అలాగే ఎలాంటి రుద్రాక్ష అంటే అలాంటి రుద్రాక్షలు కూడా ధరించకూడదు. మరి ఏ రుద్రాక్ష ధరిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రుద్రాక్షలలో ఏకముఖి రుద్రాక్ష చాలా విలువైనది.

ఎలాంటి మంత్ర తంత్ర ప్రయోగాలను అయినా తిప్పి కొట్టగలదు. దీన్ని ధరించడం వల్ల సిరి సంపదలు, శిరో సంబంధ రోగాలు తగ్గుతాయి. ద్విముఖి రుద్రాక్షను బ్రహ్మ రుద్రాక్ష అని అంటారు. ఇంకొదరు అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక అని చెబుతారు. ఈ రుద్రాక్ష ధరించడం వల్ల సంతాన ప్రాప్తి, ఏకాగ్రత, వ్యాపార అభివృద్ధి కలుగుతుందని చెబుతారు. మానసిక సమస్యను దూరం చేస్తుంది. త్రిముఖి రుద్రాక్ష అదృష్టం, ఐశ్వర్యం కలిసొచ్చేలా చేస్తుంది. ఈ రుద్రాక్ష ధరిస్తే కామెర్ల వ్యాధి తగ్గుతుంది. అలాగే సర్ప దోష నివారణ అవుతుంది. చతుర్ముఖి రుద్రాక్ష ధరించేవారు ఏ రంగంలో అయినా రాణిస్తారు. అంతేకాదు.

చదువు, ఉద్యోగంలో పనిపై ఏకాగ్రత పెరుగుతుందట. పంచముఖి రుద్రాక్ష వల్ల అకాల మృత్యునివారణ, గుండె సంబంధిత వ్యాధులు నివారణ అవుతాయి. షణ్ముఖి రుద్రాక్ష కుమార స్వామి స్వరూపం. దీన్ని ధరిస్తే శక్తి, విజయం, శరీర ధారుఢ్యం, ఆరోగ్యం లభిస్తుంది. సప్త ముఖి రుద్రాక్ష వల్ల సంపద, కీర్తి, ఉత్తేజం కలుగుతాయి. అష్టముఖి రుద్రాక్ష ధరించిన వాపిరివ ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నవముఖి రుద్రాక్ష భైరవ స్వరూపమైనది. రాజకీయాల్లో ఉన్నక స్థానాన్ని ఆశించేవారికి , అపమృత్యు నివారణ దోషాలు తగ్గించేందుకు నవముఖి రుద్రాక్ష పనికొస్తుంది.