Site icon HashtagU Telugu

TTD: శ్రీవారికి రూ.3.86 కోట్ల బంగారు యజ్ఞోపవీతం కానుక

Ttd Ornament

Ttd Ornament

తిరుమల, తిరుపతి జిల్లా: (TTD) శ్రీవారికి భక్తులు అందించే కానుకలు ఎంతగానో విశిష్టమైనవే. అయితే తాజాగా శ్రీవారికి అందిన బంగారు కానుక కళ్లకు చెదిరేలా ఉంది. విశాఖపట్నానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పువ్వాడ మస్తాన్ రావు తన సతీమణి కుంకుమ రేఖతో కలిసి, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి ఏకంగా రూ.3.86 కోట్ల విలువైన స్వర్ణ యజ్ఞోపవీతాన్ని సమర్పించారు.

ఈ మహా కానుకను వారు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు సమక్షంలో స్వామి వారికి అర్పించారు. టీటీడీ అర్చకులు దంపతులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందించి ఆశీర్వదించారు. కార్యక్రమానికి టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మీ, భాను ప్రకాష్ రెడ్డి, నరేష్ కుమార్, శాంతారాంలు హాజరయ్యారు.

ఇక తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం సాయంత్రం ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా హాజరై, రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

చంద్రబాబు వెంట ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ ఉన్నారు. రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహన సేవతో వాహన సేవలు ప్రారంభం కానున్నాయి.

Exit mobile version