Marriage: పెళ్లిలో రోలు రోకలిని ఎందుకు పూజిస్తారో తెలుసా?

ఆచారాలు,సాంప్రదాయాలు.. కాలం మారినా కూడా కొన్ని ప్రదేశాలలో ఈ ఆచార సంప్రదాయాలను చాలామంది ఇప్పటికీ

  • Written By:
  • Publish Date - November 26, 2022 / 06:30 AM IST

ఆచారాలు,సాంప్రదాయాలు.. కాలం మారినా కూడా కొన్ని ప్రదేశాలలో ఈ ఆచార సంప్రదాయాలను చాలామంది ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. ఈ ఆచార సంప్రదాయాలను పాటించాలని మన పండితులు కూడా చెబుతూ ఉంటారు. వీటి వెనుక సైన్స్ కూడా దాగి ఉంది. అయితే ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆచార్య వ్యవహారాలు సంప్రదాయాలు అనగానే వాటిని మూఢనమ్మకాలుగా భావించి కొట్టి పారేస్తూ ఉంటారు. అయితే ఇప్పటికీ కొన్ని ప్రదేశాలలో సాంప్రదాయాలు మంట కలిసిపోతుండడం వల్ల వాటిని కాపాడుకోవడం కోసం వాటిని భవిష్యత్తు తరాల వరకు నేర్పించడం కోసం ఇంట్లోని పెద్దవారు శ్రమ పడదు ఉంటారు. అలా పూజ విషయాలలో అలాగే ఏదైనా శుభకార్యాల విషయంలో ఇప్పటికీ సంప్రదాయాలను పాటిస్తూనే ఉన్నారు.

అయితే సాధారణంగా పెళ్లి వేడుకలలో రోలు రోకలిని పూజిస్తూ ఉంటారు. వాటిని పూజించి అనంతరం వాటిలో పసుపు దంచుతూ ఉంటారు. రోలు రోకలి అలాగే తిరుగలి మూడు కూడా మానవ జీవితంలో ముడిపడి ఉన్నవే చెప్పవచ్చు. అయితే ఇదివరకు రోజుల్లో పెళ్లి కుదిరితే రెండు నెలల ముందు నుంచి వడ్లు దంచుకోవడం కారం పసుపు దంచడం అరిసెల కోసం పిండిని దంచడం లాంటిది చేసేవారు. కానీ కాలం మారడంతో అన్ని రెడీమేడ్ వి ఉపయోగిస్తున్నారు. శుభకార్యాలలో మన సంప్రదాయాన్ని గుర్తు చేసుకుంటూ అన్ని దంచిన వంటలని చేసుకోండి మీరు తినండి పదిమందికి పెట్టండి అనే విషయాన్ని తెలుసుకోవడానికి రోలు రోకలి తిరుగలలి ని పూజిస్తారు.

పురాణాల ప్రకారం బలరాముడు నాగలిని, రోకలిని ఆయుధాలుగా ఉపయోగించి నాగలితో భూమిని దున్ని పంటను పండించాడు. ఆ పంటను రోకలితో దంచి భుజించండి అన్ని చెప్పాడు బలరాముడు. రోలు లక్ష్మీదేవి, రోకలి నారాయణుడు, తిరుగలి శివుడు, దాని పిడి పార్వతి. ఇట్లు ఆయా అధిష్ఠాన దేవతలను పూజించి ధనధాన్య సమృద్ధి కలగాలని ప్రార్థించడం రోలు, రోకలి, తిరగలిని పూజించడంలోని అంతరార్థము దాగిఉంది.