అక్షయ తృతీయ పండుగ అంటే లక్ష్మీదేవి పండుగగా భావిస్తూ ఉంటారు. ఈరోజున బంగారు దుకాణాలు కిటకిటలాడుతూ ఉంటాయి. అయితే బంగారు కొనుగోలు చేయలేని వారు కొన్ని రకాల వస్తువులను కొనుగోలు చేయడం వల్ల అలాంటి ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. అయితే ఈ రోజున అమ్మవారి అనుగ్రహం కలగడం కోసం కొన్ని రకాల పనులు చేయడంతో పాటుగా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించాలంటే కొన్ని వస్తువులను ఇంట్లో నుంచి ముందుగా తొలగించాలని చెబుతున్నారు. ఇంతకీ ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చీపురు అనేది శుభ్రతకు ప్రాతినిధ్యం వహించే వస్తువు. కానీ ఇది పాడైపోయి, పగిలి, ముక్కలైపోయిన స్థితిలో ఉంటే ఇంట్లో దరిద్రాన్ని తెచ్చిపెడుతుందట. అలాంటి చీపురును ఇంటిలో ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయట. కాబట్టి అక్షయ తృతీయ రాకముందే పాడైన చీపురును తీసేసి కొత్తదానిని ఇంటికి తీసుకురావడం మంచిదని చెబుతున్నారు.
ఒకవేళ మీ ఇంట్లో చిరిగిపోయిన మురికి పట్టిన, శుభ్రం చేయని బట్టలు ఉంటే వెంటనే బయటికి పడేయాలని చెబుతున్నారు. వీటివల్ల నెగిటివ్ ఎనర్జీ పెరగడంతో పాటు దరిద్రం పెరుగుతుందట. కాబట్టి అలాంటి బట్టలను వెంటనే తొలగించడం మంచిది. లేదు అంటే వాటిని ఉతికి మళ్ళీ ఉపయోగించడం మంచిది.
ఇంట్లో పని చేయని గడియారాలు, పాడైపోయిన పాత్రలు, పగిలిన అద్దాలు, పాడైపోయిన డెకరేషన్ వస్తువులు ఉంటే అవి ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని పెంచుతాయటీ. వాస్తు ప్రకారం పగిలిన వస్తువులు ధనసంపద నిలకడకు ఆటంకంగా మారుతాయట. అలాంటి వాటిని తొలగించడం ద్వారా శుభ శక్తులు ప్రవేశిస్తాయని చెబుతున్నారు.
ఇంట్లో పూజా మందిరంలో ఉన్న విగ్రహాలలో ఏదైనా పగిలినది లేదా విరిగినదైతే అది దేవతకు అవమానంగా పరిగణించబడుతుందట. కాబట్టి అటువంటి విగ్రహాలను ఇంటిలో ఉంచడం వల్ల ఆ శక్తి క్షీణిస్తుందట. అవి పవిత్రమైన నీటిలో అంటే నది లేదా చెరువులో నిమజ్జనం చేయాలని చెబుతున్నారు. ఇంటిలో సంపూర్ణ, శుభ్రమైన విగ్రహాలే ఉండాలట.