Site icon HashtagU Telugu

Camphor: కేవలం రెండు రూపాయలతో మీ ఆర్థిక పరిస్థితును కష్టాలను తొలగించుకోండిలా?

Mixcollage 29 Dec 2023 06 03 Pm 182

Mixcollage 29 Dec 2023 06 03 Pm 182

ఈ రోజుల్లో చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. కష్టపడి సంపాదించిన డబ్బు మిగలకపోగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తోందని దానితో ఆర్థిక భారాలు పెరిగిపోతున్నాయని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం చాలామంది అనేక రకాల పూజలు పునస్కారాలు పరిహారాలు పాటిస్తూ ఉంటారు. ఎలాంటి పరిహారాలు పాటించినా కూడా కొన్ని కొన్ని సార్లు మంచి ఫలితాలు కనిపించలేదని దిగులు చెందుతూ ఉంటారు. మీరు కూడా అలా ఆర్థిక సమస్యలతో మానసిక సమస్యలతో సతమతమవుతున్నారా. అయితే మేము ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు పాటిస్తే చాలు వాటిని తొలగించుకోవడంతోపాటు ఆర్థిక సమస్యల నుంచి ఊరట కూడా పొందవచ్చు..

మీరు ఎలాంటి పని మొదలుపెట్టినా కూడా ఏదో ఒక విధంగా ఆగిపోవడం,ఎవరో ఒకరు అడ్డుపడడం పనులు జరగకపోవడం లాంటివి జరుగుతున్నాయి అంటే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని అర్థం. మరి అలాంటప్పుడు ఏం చేయాలన్న విషయాన్ని వస్తే.. హిందువులకు కర్పూరం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కర్పూరం రకరకాల పమస్యలను అధిగమించేందుకు దోహదం చేస్తుంది. ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని తరిమికొట్టేందుకు ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఉదయం, సాయంత్రం ఇంట్లో కర్పూర హారతి వెలిగించాలి. ఇలా చెయ్యడం వల్ల ఇంట్లోని నెగెటివిటి దూరం అవుతుంది. ఇంటి వాతావరణం సానుకూలంగా మారుతుంది. కర్పూర హారతి వెలిగించే ముందు కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు పాటించాలి.

హారతి వెలిగించే ముందు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో ఉన్న చెత్త బయట పడెయ్యాలి. ఇల్లు ఊడ్చి, తుడిచి శుభ్రం చేసుకున్న తర్వాత హారతి చెయ్యాలి. కర్పూరాన్ని నేతిలో నానబెట్టి ఆ తర్వాత హారతిగా వెలిగిస్తే ఒక చక్కని సువాసన ఇల్లంతా నిండడమే కాదు, ఇంట్లోంచి నెగెటివిటిని తరిమి కొడుతుంది. అంతేకాదు నిద్రకు ఉపక్రమించే ముందు కర్పూరం దిండుకింద పెట్టుకోవడం ద్వారా కూడా నెగెటివిటిని ఎదుర్కోవచ్చు. అంతేకాదు సుఖ నిద్ర కూడా సాధ్యపడుతుంది. మరో చిన్న పరిహారం ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుంది. రాత్రి భోజనం ముగిసిన తర్వాత ఒక చిన్న వెండి గిన్నెలో లవంగాలు, కర్పూరాన్ని వేసి కాల్చాలి. ఇలా ప్రతి రోజూ చెయ్యడం వల్ల జీవితంలో ఐశ్వర్యం నిలిచి ఉంటుందట. కర్పూరంతో చేసే పరిహారాలు పితృదోషం, కాలసర్ప దోషం వంటి వాటి నుంచి కూడా విముక్తి పొందవచ్చు. పితృదోషాలు అభివృద్దికి ఆటంకంగా మారుతుంది. దీన్ని నివారించేందుకు ఉదయం, సాయంత్రం, రాత్రి మూడు సార్లు కర్పూరం వెలిగించాలి. ఇలా రోజూ చేస్తుంటే త్వరలోనే జీవితంలో మార్పు రావడం గమనించవచ్చు. నరదృష్టికి నాపరాళ్లు పగులుతాయని సామెత. దృష్టి దోషంతో బాధపడే వారికి ఏదో ఒక అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. ఇలా దిష్టి తగిలిన వారికి చిన్న కర్పూరం ముక్క తీసుకుని దాన్ని తలనుంచి పాదాల వరకు మూడు సార్లు సవ్య దిశలో తప్పి తర్వాత నేలపై ఉంచి వెలిగించాలి. ఇలా చేస్తే దిష్టి దోషం పోతుంది.