Vastu : అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించేటప్పుడు ఈ వాస్తు నియమాలను గుర్తుంచుకోండి.!!

శారదీయ నవరాత్రులు ప్రారంభానికి ఇంకా కొన్నిరోజులు మాత్రమే ఉన్నాయి. ఈ నవరాత్రులు అశ్వినీ మాసంలోని శుక్ల పక్ష ప్రతిపద తిథితో ప్రారంభమవుతాయి.

  • Written By:
  • Publish Date - September 24, 2022 / 06:32 AM IST

శారదీయ నవరాత్రులు ప్రారంభానికి ఇంకా కొన్నిరోజులు మాత్రమే ఉన్నాయి. ఈ నవరాత్రులు అశ్వినీ మాసంలోని శుక్ల పక్ష ప్రతిపద తిథితో ప్రారంభమవుతాయి. వీటిని శారదీయ నవరాత్రులుగా పిలుస్తారు. శారదీయ నవరాత్రే కాకుండా దీనిని దుర్గాపూజ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ సమయంలో దుర్గామాతను ఏర్పాటు చేస్తారు. శారదీయ నవరాత్రులలో దుర్గామాత తొమ్మిది రూపాలను పూజించడంతో పాటు కలశ స్థాపనను ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది మీరు దుర్గామాత విగ్రహాన్ని కూడా ప్రతిష్టించినట్లయితే, కొన్ని వాస్తు నియమాలను తప్పకండా తెలుసుకోండి. ఇలా చేస్తే దుర్గామాత ఆశీస్సులు పొందవచ్చు.

అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించేటప్పుడు ఈ వాస్తు నియమాలను గుర్తుంచుకోండి
ఈ దిశలో దుర్గామాతా విగ్రహాన్ని ప్రతిష్టించండి:
వాస్తు శాస్త్రం ప్రకారం, దుర్గామాతా విగ్రహాన్ని ప్రతిష్టించేటప్పుడు ఈశాన్య దిశలో (తూర్పు దిశలో) ప్రతిష్టించాలి. ఈ దిశలో ఏర్పాటు చేయడం వల్ల శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈశాన్యంలో స్థలం లేకపోతే, ఉత్తరం లేదా పడమర దిశలో ప్రతిష్టించవచ్చు. భక్తులు అమ్మవారిని పూజించినప్పుడు, అతని ముఖం తూర్పు లేదా దక్షిణం వైపు ఉండాలి. తూర్పు దిక్కుకు అభిముఖంగా ఉండటం వల్ల చైతన్యం కలుగుతుంది. దక్షిణం వైపు చూడడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

ఈ దిశలో దుర్గామాత విగ్రహాన్ని ఉంచవద్దు:
వాస్తు శాస్త్రం ప్రకారం దుర్గామాతా విగ్రహాన్ని దక్షిణ దిశలో ఉంచకూడదు. ఎందుకంటే ఈ దిశను యమరాజు దిశ అంటారు. దీనితో పాటు, ఈ దిశ నుండి చాలా ప్రతికూల శక్తి ఉత్పత్తి అవుతుంది. అటువంటి పరిస్థితిలో, ఈ దిశలో విగ్రహాన్ని ప్రతిష్టించడం వలన సంతోషం, శాంతి పోతుంది.

ఇంట్లో అమ్మవారి విగ్రహాం ఎంత పెద్దగా ఉండాలి:
ఒక వ్యక్తి ఇంట్లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించినట్లయితే, ఆ విగ్రహం మూడు అంగుళాల కంటే పెద్దదిగా ఉండకూడదు. దీనితో పాటు, విగ్రహం రంగు లేత పసుపు, ఆకుపచ్చ లేదా గులాబీ రంగులో ఉండాలి.

విగ్రహం పెట్టే ముందు ఈ పని చేయండి:
దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్న ప్రదేశం. ఆ స్థలంలో ముందుగా పసుపు అక్షింతలు ఉంచండి. తర్వాత విగ్రహాన్ని ప్రతిష్టించండి.