Site icon HashtagU Telugu

Hibiscus: అలాంటి సమస్యలు మిమ్మల్ని వేదిస్తున్నాయా.. అయితే మందారాలతో ఈ పరిహారం చేయాల్సిందే?

Mixcollage 08 Dec 2023 03 27 Pm 1029

Mixcollage 08 Dec 2023 03 27 Pm 1029

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఎంత సంపాదించినప్పటికీ డబ్బులు చేతిలో మిగలక ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అయితే ఆర్థిక సమస్యల నుంచి ఈ బయటపడడం కోసం శాస్త్రాలలో అనేక రకాల పరిహారాలు చెప్పబడ్డాయి. మరి శాస్త్ర ప్రకారం అందులో చెప్పిన నియమాలను పాటించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. మరి మీరు కూడా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా. అయితే ఇది మీకోసమే. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం కోసం మందారాలతో ఒక పరిహారం చేయాలి అంటున్నారు పండితులు. మరి మందారాలతో ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

మనం మందార పువ్వులను తరచుగా ఇంట్లో పూజలకు ఉపయోగిస్తూ ఉంటాం. ఈ మందారం చెట్టు వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ మందారపు ఆకులు జుట్టు సమస్యలకు ఎంతో బాగా ఉపయోగపడతాయి.. సాధారణంగా అమ్మవారి పూజలోఎర్రని పువ్వులను ఉపయోగిస్తారు. ముఖ్యంగా కాళీ మాత ఆరాధనలో ఎర్రని పూలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాళికా దేవికి ఎర్రని మందారాలు చాలా ఇష్టం. ఈ పుష్పం లేకుండా అమ్మవారి పూజ అసంపూర్ణం. హనుమంతుని పూజలో కూడా మందారపువ్వును ఉపయోగిస్తారు. వాస్తు ప్రకారం ఇంట్లో మందార మొక్క ఉండడం శుభకరం.

మందారపూల మొక్క ఇంట్లో ఉండడం లక్ష్మీ ప్రదం కూడా. ఈ మొక్క వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభాలు రావని పండితులు చెబుతుంటారు. ఇంట్లో మందార మొక్క ఉంటే జాతకంలో సూర్యుడి స్థితి బలోపేతమై ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుందట. జన్మజాతకంలో కుజదోషం ఉంటే మందారంతో పరిహారం చేసుకోవచ్చు. జాతక చక్రంలో కుజుడు బలహీనంగా ఉన్నవారికి కుజదోషం ఏర్పడుతుంది. ఇలాంటి వారికి వివాహంలో జాప్యం లేదా వైవాహిక సంబంధాల్లో సమస్యలు వస్తాయి. వీరు ఇంట్లో మందార మొక్కను తప్పకుండా పెంచుకోవాలి. మందార మొక్క పెంచుకుంటే కుజుడు శాంతిస్తాడు. సమస్యల తీవ్రత తగ్గుతుంది. మందార మొక్క ఉన్న ఇంటిలో ప్రతికూల శక్తి ప్రవేశించలేదు.

ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న వారి ఇంట్లో మందార మొక్క పెంచుకుని ప్రతి రోజు సూర్యుడికి నీటితో అర్ఘ్యం విడిచే సమయంలో మందార పువ్వును కూడా సమర్పించుకోవాలి. ఈ పరిహారం కెరీర్ లో మంచి ఫలితాలు పొందేందుకు దోహదం చేస్తుంది. అదేవిధంగా శుక్రవారం రోజు చేసే వైభవలక్ష్మీ పూజలో మందార పూలు దేవికి సమర్పించడం ద్వారా ఆమెను ప్రసన్నం చేసుకోవచ్చు. ఎర్రని మందారాలు సమర్పించి కోరినకోరికలు నెరవేర్చమని లక్ష్మీ దేవిని కోరుకుంటే ఆమె తప్పక కటాక్షిస్తుంది. అ పరిహారం చేసుకున్న వారికి ఆర్థిక సమస్యలు తీరుతాయి. కోరిన ఉద్యోగం పొందుందుకు మార్గాలు సుగమం అవుతాయి.