Site icon HashtagU Telugu

Lord Shani: శని బాధల నుంచి విముక్తి పొందాలి అంటే శనివారం రోజు ఈ పరిహారాలు పాటించాల్సిందే!

Lord Shani

Lord Shani

మామూలుగా శనివారం శనీశ్వరుడికి అంకితం చేయబడింది. ఈ రోజున ఆయనను భక్తిశ్రద్ధలతో ప్రత్యేకంగా పూజించడం వల్ల ఆయన అనుగ్రహం కలుగుతుందని దానివల్ల శని బాధలు, శనికి సంబంధించిన సమస్యలు ఉంటే ఈజీగా బయటపడవచ్చు అని పండితులు చెబుతూ ఉంటారు. అలాగే గ్రహాల గమనం వల్ల ఏలినాటి శని అర్ధాష్టమ శని వల్ల ఎలాంటి పనులు తలపెట్టినా కూడా ఆలస్యం అవ్వడం జరగకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తూ ఉంటుంది. కాబట్టి శని బాధలు తొలగిపోయి సకల శుభాలు కలగాలి అంటే శనివారం రోజు ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వారంలో ఏడో రోజైన శనివారానికి చాలా ప్రత్యేకత ఉంది. హిందూ సంప్రదాయం ప్రకారం, శనివారం శనిదేవుని ఆరాధనకు ప్రధానమైనదిగా భావిస్తారు. అంతే కాకుండా ఈ రోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వర స్వామికి, ఆంజనేయస్వామికి ఎంతో ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఇకపోతే శనివారం రోజు పాటించాల్సిన విధివిధానాల విషయానికొస్తే.. శనివారం రోజు నలుపు రంగు దుస్తులు ధరించడంతోపాటు నవగ్రహాలు ఉన్న ఆలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయిస్తే చాలా మంచి జరుగుతుందట.. శనీశ్వరుని వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించి, బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలట. ఈ నైవేద్యాన్ని ఇంటికి తీసుకెళ్లకూడదట. అలాగే నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలట.

ఇలా చేయడం వలన శని అనుగ్రహాన్ని పొందవచ్చట. అదేవిధంగా శనివారం రోజు వేంకటేశ్వరుని పూజిస్తే శని దేవుని అనుగ్రహం తప్పక కలుగుతుందట. ఈ రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించి వేంకటేశ్వరుని ఆలయాన్ని సందర్శించి కొబ్బరికాయ కొట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని చెబుతున్నారు. శనివారం ఆంజనేయ స్వామిని కొలిచిన వారికి శని బాధలు ఉండవని చెబుతున్నారు. శనివారం రోజు ఆంజనేయస్వామికి 11 ప్రదక్షిణాలు చేయాలి. హనుమంతునికి శనివారం వడమాల సమర్పిస్తే శని బాధలు తొలగిపోతాయని చెబుతున్నారు. శనివారం ఆంజనేయునికి ఆకుపూజ చేయిస్తే ఎలాంటి కష్టాలు అయినా తొలగిపోతాయట. అలాగే ఐదు శనివారాలు లేదంటే తొమ్మిది శనివారాలు శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయట. కాగా శనివారం శివాలయం ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు కింద దీపం పెట్టి, రావి చెట్టు చుట్టూ 9 ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలంగా పీడిస్తున్న సమస్యలు తొలగిపోతాయట. అలాగే శనివారం ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకూడదట. డబ్బు అప్పుగా తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు.

Exit mobile version