మాములుగా చాలా మంది నరదిష్టితో బాధపడుతున్నాం అని అంటూ ఉంటారు. ఎన్నో రకాల ఇబ్బందులను గురి చేయడంతో పాటు అనేక విధాలుగా మనిషిని ప్రభావితం చేస్తుంది. అలాగే ఆర్థిక, ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందట. అయితే ఈ నరదిష్టి సమస్య నుంచి బయట పడటం కోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే ఇందుకోసం మంగళవారం రోజు 21 ఎండు మిరపకాయలు తీసుకుని దండలా చేసి దానిని ఇంటి గుమ్మానికి వేలాడదీయాలట. ఇలా చేస్తే ఇంటికి, ఇంట్లోని కుటుంబ సభ్యులపై ఉన్న భయంకరమైన కనుదిష్టి తొలగిపోతుందని చెబుతున్నారు.
అలాగే బ్రహ్మ దండి తంత్ర పరిహారం పాటిస్తే అన్ని దిష్టి దోషాలు పోతాయని చెబుతున్నారు. ఆ పరిహారం కోసం ఆదివారం రోజున బ్రహ్మజెముడు చెట్టును ఇంటికి తీసుకురావాలి. ఆ తర్వాత దానిని ఇంట్లోని ఈశాన్య మూలలో తలకిందులగా వేలాడదీయాలి. ఆ పై ప్రతి శుక్రవారము గుగ్గిలం పొగ వేయాలి. ఈ పరిహారం చేస్తే ఇంటి సభ్యులందరిపై ఉన్న దిష్టి మొత్తం పోతుందని పండితులు చెబుతున్నారు. అలాగే భయంకరమైన కను దిష్టి, మన ఎదుగుదల చూసి అవతలి వాళ్ళు ఏడుస్తున్నారు అనుకుంటే రామ మునగ చెట్టు పరిహారం అందుకు మంచి ఫలితాలను కలిగిస్తుందని చెబుతున్నారు.
ఇందుకోసం అమావాస్య రోజు సాయంత్రం పూట ఈ రామ మునగ చెట్టును ఇంటికి తీసుకురావాలి. ఆ మరుసటి ఉదయం ఈ చెట్టును ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి. ఇలా చేయడం వల్ల ఆ చెట్టు యజమానిని రామబాణంలా కాపాడుతుందని చెబుతున్నారు. అదేవిధంగా ప్రతీ శనివారం నరసింహ స్వామి ఆలయంలో తులసి మాల సమర్పించి, కొబ్బరికాయ కొట్టాలట. ఆ తర్వాత ఏదైనా తీపి పదార్థం లేదా పులిహోరను నైవేద్యంగా సమర్పించి, దానిని గుడి ఆవరణలో భక్తులకు పంచిపెట్టాలని చెబుతున్నారు. ఇలా చేస్తే నరదృష్టి సమస్య తొలగిపోతుందని చెబుతున్నారు. భయంకరమైన కనుదిష్టి, ఎదుటివాళ్ల ఏడుపులతో ఇబ్బందిపడుతున్న వారు ఏనుగు వెంట్రుక ఉంగరం ధరిస్తే మంచిదట.