Site icon HashtagU Telugu

Shani Effects: ఏలినాటి శని దోషం తీవ్రత తగ్గాలంటే ప్రతి వారం ఇలా చేయాల్సిందే?

Shani

Shani

Shani Effects:  నవగ్రహాలలో అత్యంత ప్రభావంతమైన గ్రహం శని గ్రహం. నవగ్రహాలలో ఒకటైన రవి పుత్రుడు ఈ శని దేవుడు. నవగ్రహాలలో శని దేవునికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక ఏలినాటి శని అంటే ఏమిటి అన్న విషయానికి వస్తే..అయితే జాతక చక్రంలో 12 రాశులు ఉంటాయి. గోచారం ప్రకారం గ్రహాలు ఆయా రాశుల్లో ప్రవేశించిన సమయంలో ఆయా గ్రహాల శుభాశుభా ఫలితాలు వస్తుంటాయి. కాబట్టి మనం కర్మ ఫలాన్ని అలాగే ఏలినాటి శని ప్రభావాన్ని తప్పించుకోలేము. కానీ కొన్ని పూజ పద్ధతుల ద్వారా శని ప్రభావాన్ని కాస్తయినా తప్పించుకోవచ్చు.

మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా శని దేవుడిని అందరూ మంద గమనుడు లేదంటే మందుడు అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే శని ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాల పాటు ఉంటారు. ఈ విధంగా ఆ జాతకుడి 12 వ ఇంట, 1 ఇంట, 2వ ఇంట ఉండే వరకు ఏల్నాటి శని ప్రభావం ఉంటోంది. మొత్తంగా ఏడున్నర ఏళ్లు ఏల్నాటి శని ప్రభావం ప్రతి జాతకుని జీవితంలో ఉంటోంది. శని దశ ప్రారంభం అయినప్పుడు కష్టాలు ప్రారంభమవుతాయి. ప్రభావం వల్ల అనుకోని చిక్కులు అనవసరమైన ఖర్చులు అలాగే నా అనుకున్న వారితో గొడవలు జరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి.

అలాంటప్పుడు శనీశ్వర గ్రహ తీవ్రతను తగ్గించుకోవాలంటే..విష్ణు సహస్రనామం, రుద్ర నమక చమకాలు, ఆదిత్య హృదయంతో పాటు సుందరాకాండ పారాయణంతో పాటు హనుమాన్ చాలీసా, ఆంజనేయ దండకంతో పాటు శని స్తోత్రం, శని చాలీసా,శని అష్టోత్తర సహస్రనా స్త్రోత్రం చేస్తే శని గ్రహ ప్రభావ తీవ్రత చాలా తక్కువగా ఉంటుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాకుండా ప్రతి శనివారం నాడు నవగ్రహ ఆలయంలోని శని దేవుడిని ఆరాధించడం శనీశ్వరి ముందు నల్ల నువ్వుల నైవేద్యంగా సమర్పించడంతో పాటుగా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం పక్షులకు ఆహారంగా వేయడం వల్ల దోశ తీవ్రతను తగ్గించుకోవచ్చు.

Exit mobile version