Site icon HashtagU Telugu

Attract Money: చేతిలో డబ్బు నిలవడం లేదా.. అయితే వెంటనే ఇలా చేయండి!

SBI- HDFC

SBI- HDFC

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. సంపాదించిన డబ్బులు చేతిలో నిలవడం లేదని చాలామంది దిగులు చెందుతూ ఉన్నారు. సంపాదించిన డబ్బులు చేతిలో మిగలకపోగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తోందని చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటప్పుడు కొన్ని రకాల పరిహారాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. ప్రతిరోజు రెండు లవంగాలను దిండు కింద పెట్టుకొని పడుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయట.

ఇలా చేస్తే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని డబ్బు సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయని చెబుతున్నారు. హిందువులు తులసి మొక్కను లక్ష్మీ స్వరూపంగా కాబట్టి ప్రతిరోజు రాత్రి పూట రెండు తులసి ఆకులను దిండు కింద పెట్టుకుని పడుకోవడం వల్ల ఎప్పటినుంచో రావాల్సిన డబ్బులు కూడా సులువుగా వస్తాయని పండితులు చెబుతున్నారు. పసుపును కూడా లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తూ ఉంటారు. అయితే పడుకునేటప్పుడు దిండు కింద పసుపును ఒక చిన్న ప్యాకెట్ లో పెట్టుకొని పడుకోవడం వల్ల ప్రశాంతత లభించడంతోపాటు ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు.

అలాగే నెమలి పించం కూడా రాత్రిపూట పడుకునేటప్పుడు దిండు కింద పెట్టుకుని పడుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని, అదృష్టం మీ వెంటే ఉంటుందని చెబుతున్నారు. చెడు కలలు రావని ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చెబుతున్నారు. రాత్రిపూట ఒక చిన్న సంచులో ఉప్పును పెట్టుకునే దానిని తల దిండు కింద పెట్టుకుని పడుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందట. దోషాలు కూడా తొలగిపోతాయని చెబుతున్నారు. కర్పూరం ముక్కను దిండు కింద పెట్టుకోవడం వల్ల పాజీటివ్‌ ఎనర్జీ పెరుగుతుందట. అప్పులు ఉన్నవారికి వెంటనే ప్రశంతత లభిస్తుంది. మంచి నిద్ర కూడా పడుతుందని పండితులు చెబుతున్నారు. అయితే పైన చెప్పిన రెమిడీలను 21 రోజులపాటు పాటించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.