హిందువులు అనేక రకాల చెట్లను దేవతలుగా భావించి పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఇక హిందువులు పూజించే మొక్కలలో రావి చెట్టు కూడా ఒకటి. రావి చెట్టుకు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా శనికి సంబంధించిన బాధల నుంచి విముక్తి పొందాలని రావి చెట్టును పూజిస్తూ ఉంటారు. రావి చెట్టుపై లక్ష్మీదేవి నివసిస్తుందని హిందువుల విశ్వాసం. అందుకే శనివారం రోజున రావి చెట్టుకు నీటిని సమర్పిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది.శనివారం రావి చెట్టు కింద దీపం వెలిగించడం కూడా చాలా ముఖ్యం. హిందువుల నమ్మకం ప్రకారం చెట్లను పూజించడం వల్ల జీవితంలో సుఖ సంపదలు లభిస్తాయని విశ్వాసం. రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.
రావి చెట్టుకు మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాదు. శాస్త్రీయ దృక్కోణంలో కూడా ఈ చెట్టు చాలా అద్భుతంగా పరిగణిస్తారు. రావి చెట్టు ప్రాణాధారమైన గాలి ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. మానవులకు అవసరమైన ఆక్సిజన్ ను రావి చెట్టు అత్యధికంగా రిలీజ్ చేస్తుంది. ఆరోగ్యం బాగోలేకపోతే రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయడం ప్రయోజనకరం. రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇది శరీరంలో పిత్త , వాత సమతుల్యతను కాపాడుతుంది. ఈ చెట్టుకు నీరు సమర్పించి దీపం వెలిగించడం ద్వారా శనిదేవుడు ప్రసన్నుడై సంతోషాన్ని, అదృష్టాన్ని ప్రసాదిస్తాడు.
శనీశ్వరుడు దృష్టి పడిన వ్యక్తి జీవితంలో కష్టాలు ఏర్పడతాయి. అదే సమయంలో శనీశ్వరుడు ఎవరి పట్ల అయినా సంతోషంగా ఉంటే అతని జీవితంలో శుభప్రదంగా సాగుతుందని నమ్మకం.
ఎవరి జాతకంలో నైనా శనిదోషం ఉంటె, అది తొలగిపోవాలంటే ప్రతినెలా అమావాస్య రోజున శనివారం రోజున రావి చెట్టుకు ఏడుసార్లు ప్రదక్షిణలు చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. అంతేకాకుండా రావి చెట్టు దగ్గర ఆవనూనె దీపం వెలిగించడం కూడా శుభప్రదం. ఈ పరిహారం చేయడం వల్ల శనిగ్రహ కోపం నుండి ఉపశమనం పొందుతారు. అలాగే మనశ్శాంతి కోసం రావి చెట్టును కూడా పూజిస్తారు. ప్రదక్షిణలు చేస్తారు. బ్రహ్మ ముహూర్త సమయంలో రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుందని నమ్ముతారు. భయం లేదా చెడు ఆలోచనలు మనస్సులోకి రావు. మరోవైపు రావి చెట్టుకు ప్రతిరోజూ ప్రదక్షిణలు చేస్తే, ప్రజలు ఆర్థిక సంక్షోభం నుండి ఉపశమనం పొందుతారు. జీవితంలో ఏర్పడిన కష్టాల నుండి విముక్తి పొందుతారు.