హిందువులు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో రకాల నియమాలు పాటిస్తూ ఉంటారు. పెద్దలు చెప్పిన విషయాలను కూడా చాలా మంది తప్పకుండా పాటిస్తూ ఉంటారు. అయితే కొన్నింటి వెనక కొన్ని కొన్ని రకాల కారణాలు దాగి ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని నియమాలను ఉల్లంఘిస్తే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అటువంటి వాటిలో తల స్నానం చేయడం కూడా ఒకటి. ముఖ్యంగా వారంలో కొన్ని రోజులు స్నానం చేయడం అస్సలు మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు.
మరి ఏ రోజున తల స్నానం చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పెళ్లికాని అమ్మాయిలు బుధవారం నాడు హెయిర్ వాష్ చేయడం శుభప్రదంగా పరిగణించబడదుట. ఈ రోజున పెళ్లి కాని అమ్మాయిలు తలస్నానం చేస్తే వీళ్లు జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అలాగే పెళ్లైన ఆడవారు మంగళవారం, గురువారం, శనివారాల్లో తలస్నానం చేయకూడదని చెబుతున్నారు. ఈ రోజున వివాహిత స్త్రీ తలస్నానం చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. అలాగే లక్ష్మీదేవికి శుక్రవారం అంకితం చేయబడింది.
అందుకే ఈ రోజున పెళ్లైన ఆడవారు ఈ రోజు తలస్నానం చేసి లక్ష్మీదేవికి పూజిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగి పోతాయని చెబుతున్నారు. అదేవిధంగా స్త్రీ, పురుషులిద్దరూ గురువారం నాడు తలస్నానం చేయకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. హిందూ మతంలో గురువారన బృహస్పతికి అంకితమైన రోజుగా భావిస్తారు. అందుకే ఈ రోజున హెయిర్ వాష్ చేసుకోవడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బాగుండదట. అంతేకాదు ఈ రోజు జుట్టుకు నూనెను కూడా పెట్టకూడదని చెబుతున్నారు. అలాగే ఏకాదశి, అమావాస్య, పూర్ణిమ నాడు కూడా తలస్నానం చేయడం, కట్ చేయడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు.