Rudraksha: రుద్రాక్ష యొక్క మూలం ఎలా జరిగింది, శివునికి, రుద్రాక్షకు ఉన్న సంబంధం ఏంటి..!!

హిందూసంప్రదాయం ప్రకారం రుద్రాక్షను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. రుద్రాక్ష శివుని కన్నీటి నుండి ఉద్భవించిందని నమ్ముతారు. అందుకే శివుడు, రుద్రాక్షల మధ్య సంబంధం ఉంది.

  • Written By:
  • Publish Date - July 11, 2022 / 01:20 PM IST

హిందూసంప్రదాయం ప్రకారం రుద్రాక్షను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. రుద్రాక్ష శివుని కన్నీటి నుండి ఉద్భవించిందని నమ్ముతారు. అందుకే శివుడు, రుద్రాక్షల మధ్య సంబంధం ఉంది. రుద్రాక్షాలకు సంబంధించిన ఇతిహాసాలు, కథలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. కానీ దేవి భగవత్ పురాణం ప్రకారం, రుద్రాక్ష యొక్క మూలం శివుని కన్నీళ్లు అని నమ్ముతారు. వాస్తుశాస్త్రంలో రుద్రాక్ష కూడా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వాస్తు ప్రకారం, రుద్రాక్ష ఇంటికి సానుకూలతను తెస్తుంది. రుద్రాక్ష మూలం ఏంటి… అది శివునికి ఎందుకు సంబంధించినదో తెలుసుకుందాం.

రుద్రాక్ష శివుని కన్నీటి నుండి ఉద్భవించింది

పురాణ గ్రంథాల ప్రకారం, రుద్రాక్ష శివుని కన్నీళ్ల నుండి ఉద్భవించిందని చెబుతుంటారు. శివునితో అనుబంధం ఉన్న రుద్రాక్ష చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దేవీ భాగవత్ పురాణం ప్రకారం, త్రిపురాసురుడు అనే రాక్షసుడు ఋషులను, దేవతలను చాలా హింసించేవాడు. త్రిపురాసురుని ఆగడాలను అడ్డుకుని అంతం చేయాలనే ఉద్దేశ్యంతో, దేవతలందరూ పరిష్కారం కోసం శివుని వద్దకు వెళ్తారు. శివుడి తమ బాధను చెప్పుకుంటారు. బాధతో శివుడు యోగ నిద్రలోకి వెళ్తాడు. అప్పుడు శివుడు కళ్ళు తెరిచినప్పుడు, శివుని కళ్ళ నుండి కొన్ని కన్నీటి చుక్కలు భూమిపై పడ్డాయి. ఆ కన్నీళ్లే రుద్రాక్షగా మారాయని భక్తులు నమ్ముతుంటారు. అందుకే రుద్రాక్ష శివుని కన్నీటి నుండి ఉద్భవించిందని నమ్ముతారు.

రుద్రాక్ష అంటే ఏమిటి
రుద్రాక్ష అంటే శివుడు. కన్ను పేరులోనే స్పష్టంగా ఉంటుంది. శివుని కన్నుల నుండి కన్నీరు భూమిపై పడిన ప్రదేశంలో రుద్రాక్ష మొక్క పెరిగిందని నమ్ముతారు. శివునికి రుద్రాక్ష అంటే చాలా ప్రీతికరమైనది ఇదే. రుద్రాక్షను ధరించి శివుడిని పూజించడం ద్వారా ఆయన చాలా సంతోషిస్తాడని…భక్తులు కోరికలు తీర్చుతాడని నమ్ముతుంటారు.

రుద్రాక్ష ధరించి శివుడిని పూజించండి
శివుని కన్నీటి నుండి ఉద్భవించిన రుద్రాక్ష శివునికి చాలా ప్రీతికరమైనది. మత గ్రంథాల ప్రకారం, రుద్రాక్షను ధరించి శివుడిని పూజించిన వెంటనే శివుడు ప్రసన్నుడవుతాడు. కానీ ఒక ముఖి రుద్రాక్ష శివుని రూపాన్ని కలిగి ఉంటుంది. ఒక ముఖి రుద్రాక్షను ధరించడం ద్వారా శివునితో పాటు సూర్య భగవానుని ఆశీర్వాదం పొందుతారు.