TTD: టీటీడీ ఉద్యోగులకు వార్షిక క్రీడాపోటీలు.. ఆ రోజు నుంచి షురూ

  • Written By:
  • Updated On - February 27, 2024 / 11:51 PM IST

TTD: టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు మార్చి 1వ తేదీ శుక్ర‌వారం ఉదయం 10 గంటలకు తిరుపతిలోని పరిపాలనా భవనంలో గల పరేడ్‌ మైదానంలో ప్రారంభ‌మ‌వుతాయి. ఈ పోటీలు మార్చి 18వ తేదీ వరకు జరుగనున్నాయి. ప్రారంభ కార్యక్రమంలో క్రీడల్లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న ఉద్యోగుల పేర్లు, టీమ్‌లు, పోటీ షెడ్యూల్‌ తదితర వివరాలు తెలియజేయడం జరుగుతుంది.

పురుషులకు, మహిళలకు వేరువేరుగా పోటీలు నిర్వహిస్తారు. ఇందులో టగ్‌ ఆఫ్‌ వార్‌, చెస్‌, వాలీబాల్‌, క్యారమ్స్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, టేబుల్‌ టెన్నిస్‌, క్రికెట్‌, షటిల్‌, టెన్నిస్‌ తదితర క్రీడలు నిర్వహిస్తారు. టీటీడీ సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత క్రీడల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

టీటీడీ చరిత్రలో కనీ, వినీ, ఎరుగని రీతిలో కాంట్రాక్టు, సొసైటీ ల ద్వారా టీటీడీ లో పనిచేస్తున్న ఉద్యోగులపై చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి వరాల వాన కురిపించారు. రెగ్యులర్, రిటైర్డ్ ఉద్యోగుల 30 ఏళ్ళ ఇంటి స్థలాల కల ను నిజం చేసి సమస్యలన్నీ అధిగమించి వారికి ఇంటి స్థలాలు పంపిణీ చేయించారు. గత బోర్డు సమావేశాల్లో పారిశుధ్య, పోటు, ఉగ్రాణం, వేద పాఠశాలలు, శిల్పకళాశాల తో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఆరు వేల మంది కాంట్రాక్టు, సొసైటీ, సంభావన ఉద్యోగులకు జీతాలు పెంచారు. మిగిలిన 9 వేల 750 మందికి కూడా వారి కేడర్, సీనియారిటీ ని బట్టి 3 వేల నుండి 20వేల వరకు జీతాలు పెంచుతూ సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో ఆమోద ముద్ర వేశారు.