TTD : తిరుమలలో పనిచేయని సిఫార్సు లేఖలు!

TTD : ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ముఖ్యంగా ఏప్రిల్ 15 నుంచి మూడు నెలల పాటు ప్రజాప్రతినిధులు, IAS, IPS, ఇతర ప్రభుత్వ అధికారుల సిఫార్సు లేఖలను (Letters of Recommendation) TTD స్వీకరించదు

Published By: HashtagU Telugu Desk
Recommendation Letters Not

Recommendation Letters Not

వేసవి(Summer)లో భక్తుల (Devotees) రద్దీ ఎక్కువగా ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అనుసరిస్తున్న ప్రత్యేక నియమాలు ఇప్పుడు భక్తులకు కాస్త ఇబ్బంది కలిగిస్తున్నాయి. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ముఖ్యంగా ఏప్రిల్ 15 నుంచి మూడు నెలల పాటు ప్రజాప్రతినిధులు, IAS, IPS, ఇతర ప్రభుత్వ అధికారుల సిఫార్సు లేఖలను (Letters of Recommendation) TTD స్వీకరించదు. ఈ ఏడాది కూడా అదే విధానం అమల్లో ఉన్నప్పటికీ, ఈసారి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వకపోవడం గమనార్హం.

Vishwambhara : ట్రోల్స్ దెబ్బకు.. పెరిగిన చిరంజీవి ‘విశ్వంభర’ VFX బడ్జెట్.. ఎన్ని కోట్లు తెలుసా?

తమ దగ్గర ఉన్న సిఫార్సు లేఖల ఆధారంగా శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు తిరస్కరణకు గురవుతూ, అయోమయానికి లోనవుతున్నారు. అధికారికంగా నిరాకరణ వెలువడకపోవడం వల్ల, భక్తులు ముందుగా సమాచారం లేకుండా తిరుమలకు వచ్చి నిరుత్సాహంతో వెనుదిరుగుతున్నారు. ఈ పరిస్థితి భక్తుల్లో అసంతృప్తికి దారి తీస్తోంది. వేసవిలో అధిక భక్తుల రద్దీ కారణంగా సిఫార్సులపై నిషేధం సహజమే అయినా, TTD తరఫున ముందుగానే అధికారిక ప్రకటన రావాల్సిన అవసరం ఉంది. దీంతో భక్తులు తమ పర్యటనలను ముందుగానే సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. భక్తుల గందరగోళాన్ని నివారించేందుకు, భవిష్యత్తులో TTD మరింత స్పష్టతతో ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

  Last Updated: 21 Apr 2025, 10:47 AM IST