Site icon HashtagU Telugu

Surya Mantra: సూర్యునికి అర్ఝ్యం నైవేద్యంగా సమర్పించేటప్పుడు ఈ పది మంత్రాలు పఠిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి..!!

Puja

Surya Puja

సూర్యుడు ప్రపంచానికి ఆత్మ. సూర్యుడులేని లోకాన్ని ఊహించలేము. ఈ భూమిపై జీవరాశి మనుగడ సాధించాలంటే సూర్యుడు ఉండాలి. దీనినే సార్వత్రిక సత్య సత్యం అంటారు. ఋగ్వేదంలోని దేవతలలో సూర్యుడికి ప్రముఖ స్థానం ఉంది. ఉపనిషత్తులో, సూర్యుడు మొత్తం ప్రపంచం ఆవిర్భావానికి ఏకైక కారణమని తెలిపింది. ఆదివారం సూర్య భగవానుని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చాలామంది నమ్ముతుంటారు. ఆచారాలు, పద్దతులతో సూర్యభగవానుడిని ఆరాధించినట్లయితే…ఆ భగవంతుని అనుగ్రహం ప్రతిచోటా, ప్రతి వ్యక్తిపైనా ఉంటుంది.

ఆదివారం కొన్ని మంత్రాలను పఠిస్తే సూర్యుడు సంతోషిస్తాడు. సూర్య భగవానుడిని పూజించే సమయంలో సూర్య మంత్నాన్ని జపించాలి. ఇలా చేస్తే మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఇప్పుడు సూర్య భగవానుడి ముందు ఎలాంటి మంత్రాలను జంపించాలో తెలుసుకుందాం.

1. ఓం హ్రోం ఖగాయ నమః
ఈ మంత్రాన్ని జపిస్తే మనిషి శారీరక బలం, తెలివితేటలు పెరుగడంతోపాటుగా ఆ వ్యక్తి జ్ఞానానికి బానిస అవుతాడు.

2. ఓం హ్రాం మిత్రాయ నమః
ఈ మంత్రాన్ని పఠిస్తే ఆరోగ్యప్రయోజనంతోపాటుగా.. గుండె బలం కూడా పెరుగుతుంది.

3. ఓం హ్రీం రవయే నమః
క్షయ వంటి వ్యాధులతో పోరాడుతున్నవారు ఈ మంత్రాన్ని పఠించండి. ఈ మంత్రంతో వ్యక్తి కఫ సమస్య నుండి బయటపడతాడు. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

4. ఓం సూర్యాయ నమః
మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే సూర్య భగవానుడి మంత్రాన్ని పఠించండి.

5. ఓం హ్రాం భానవే నమః
జ్యోతిషశాస్త్రం ప్రకారం, పురీషనాళం, మూత్రాశయానికి సంబంధించిన వ్యాధుల నుండి బయటపడటానికి ఈ మంత్రాన్ని జపించండి.

6. ఓం హ్రాం హిరణ్యగర్భాయ నమః
ఈ మంత్రం విద్యార్థులకు ప్రత్యేకంగా ఉంటుంది. దీన్ని పఠించడం వల్ల మేధో వృద్ధి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

7. ఓం హ్రః పూషణే నమః
ఈ మంత్రం సహనం, సంయమనం కలిగి ఉండే సామర్థ్యాన్ని పెంచుతుంది. అంతే కాదు, ఎనర్జిటిక్ గా ఉండేందుకు సహాయపడుతుంది.

8. ఓం భాస్కరాయ నమః
సూర్య దేవుడిని పూజించే రోజు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల శరీరం అంతర్గతంగా శుద్ధి అవుతుంది.

9. ఓం ఆదిత్యై నమః
ఆర్థిక సమస్యల నుండి బయటపడటానికి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఈ మంత్రాన్ని జపించండి. ఇలా చేస్తే డబ్బు సమస్య తొలగిపోతుంది.

10. ఓం అర్కాయ నమః
మానసిక బలం కోసం ఈ మంత్రాన్ని జపించండి. ఇది జీవితంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది.

Exit mobile version