Site icon HashtagU Telugu

Navagraha Hymns: మీ జాతకంలో దోషాలు తొలగిపోవాలంటే…ఈ నవగ్రహ స్తోత్రాలు పఠించండి..!!

navagraha

పురాణాల ప్రకారం నవ గ్రహాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నవ గ్రహాలను భక్తులందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. నవ గ్రహ స్తోత్రాలను వేద వ్యాసుడు రచించినట్లు పురాణాలను బట్టి తెలుస్తోంది. నవ గ్రహాలను అత్యంత శక్తివంతమైన. ప్రభావవంతమైని భావిస్తారు. అంతేకాదు ఇవి భూమిపై మన జీవితాన్ని సమన్వయం చేస్తుంటాయని చాలా మంది నమ్ముతారు. అయితే ఈ తొమ్మిది గ్రహాలలో ప్రతి ఒక్క గ్రహానికి ఓ ప్రత్యేకత ఉంది.

నవ గ్రహాలు మన జీవితంలోని కొన్ని లక్షణాలతో ముడిపడి ఉంటాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జాతకంలో గ్రహాల స్థానం, ఇతర గ్రహాలతో కలయికను బట్టి, వ్యక్తులు వారి జీవితంలో శుభ ఫలితాలను లేదా అశుభ ఫలితాలను పొందుతారు. దేవుడిని ప్రార్థించే సమయంలో ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రాన్ని అత్యంత విశ్వాసంతో, అంకితభావంతో జపిస్తే అంతా మంచే జరుగుతుంది. నవ గ్రహాలను ఆరాధించడం వల్ల మీకు కచ్చితంగా అనుగ్రహం లభిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఎందుకంటే ఈ గ్రహాలు మీ పనులపై మంచి ప్రభావాన్ని చూపుతాయి.

నవ గ్రహా స్తోత్రాలు..

నవ గ్రహ శ్లోకం: ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః
రవి: జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్
చంద్ర: దథిశంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవమ్ నమామి శశినం సోమం శంభో-ర్మకుట భూషణమ్
కుజ: ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహమ్
బుధ: ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్
గురు: దేవానాం చ రుషీణాం చ గురుం కాంచనసన్నిభమ్ బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్
శుక్ర: హిమ కుంద మృణాళాభం దైత్యానం పరమం గురుమ్ సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్
రాహువు: అర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనమ్ సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్
కేతువు: ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్

Exit mobile version