Site icon HashtagU Telugu

Flowers: దేవుడికి సమర్పించే పువ్వులను వాసన ఎందుకు చూడకూడదో మీకు తెలుసా?

Flowers

Flowers

హిందువులు దేవుళ్లకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. హిందూమతంలో కూడా దేవుళ్లకు, పూజలకు చాలా ప్రాముఖ్యత ఉంది. కొందరు వారానికి రెండు మూడు రోజులు మాత్రమే దీపారాధన చేస్తే మరి కొందరు ఉదయం సాయంత్రం ప్రతి రోజు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. భగవంతునికి పూజ చేసేటప్పుడు దీపం, అగరవత్తులు ఎంత ముఖ్యమో పూలు కూడా అంతే ముఖ్యం. కాబట్టి దేవుడికి పూజ చేసేటప్పుడు పువ్వులు ఉపయోగించడం అన్నది తప్పనిసరి. పూజకు తప్పనిసరిగా ఒక పుష్పం ఉండాలి.పూజకు పూలు ఉపయోగిస్తే భగవంతుడు ప్రసన్నుడవుతాడని నమ్మకం.

అలాగే దీని పరిమళం వాతావరణం చుట్టూ వ్యాపించి మనసును ఆహ్లాదపరుస్తుంది. సుగంధ శక్తులు సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. అయితే చాలామంది పిల్లలు పెద్దలు తెలిసి తెలియక దేవుడికి పూలు పెట్టే విషయంలో ఒక చిన్న తప్పు చేస్తూ ఉంటారు. అదేమిటంటే దేవుడికి పెట్టే పూలను వాసన చూడకూడదు. ఈ విషయాన్ని మన ఇంట్లోని పెద్దలు కూడా తరచూ చెబుతూ ఉంటారు. అలా పూలు వాసన చూసినప్పుడు వాళ్ళు కొట్టడం లేదా తిట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే దేవుడికి పెట్టే పూలు ఎందుకు వాసన చూడకూడదో?దాని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పువ్వులు దైవిక శక్తిని ఆకర్షిస్తాయని నమ్ముతారు. పూలను వాడటం వల్ల ఆ ప్రదేశం అందంగా కనిపించడమే కాకుండా సువాసన కూడా వస్తుంది. మనస్సు ఏకాగ్రతను పెంచడానికి ఈ పాలరాయి సహాయపడుతుంది. పూజ చేసేటప్పుడు మనస్సు ఏకాగ్రంగా ఉండాలి, మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ఒక పువ్వును వాడితే దాని సువాసన ప్రతిచోటా వ్యాపించి పర్యావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది, మనసులో దైవభక్తి పెరుగుతుంది. భగవంతునికి ఉపయోగించే పుష్పం ఎలా ఉండాలి? దేవుడికి వాడే పూలకు రేకులు ఉండాలి. పువ్వులు సమర్పించడం హిందూ సంప్రదాయంలో ముఖ్యమైన భాగం. చాలామంది ప్రజలు తమ ఇళ్లలోని దేవాలయాలలో దేవతలను పూలతో అలంకరించడానికి ఇష్టపడతారు, ఎందుకంటే ఇది దేవుడికి దైవిక రూపాన్ని ఇస్తుంది.

ఇతర పువ్వులతో పోల్చినప్పుడు నిర్దిష్ట పువ్వులు నిర్దిష్ట దేవతల పవిత్రాలను ఆకర్షించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అటువంటి పుష్పాలను భగవంతుడికి సమర్పించినప్పుడు, విగ్రహంలోని భగవంతుని చైతన్యం నుండి మనం వెంటనే ప్రయోజనం పొందుతాము. విఘ్నేశ్వరుని పూజించేటప్పుడు విఘ్నేశ్వరుడికి తెల్లజిల్లేడు పువ్వులు ఇష్టం కాబట్టి వాటితో పూజ చేయడం మంచిది. భక్తులకు ఇష్టమైన దైవాలున్నట్టే, ఆ దేవతలకూ కూడా ఇష్టయిష్టాలున్నాయి. ఒక్కో దేవుడు ఒక్కో పువ్వును ఇష్టపడతారు. ఆ పూలతో పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలా పరమేశ్వరుడికి ఉన్నత్త పువ్వు, కాళీమాతకు ఎర్రమందారం మహావిష్ణువుకు పారిజాత పుష్పాలు అంటే చాలా ఇష్టం. ఇలా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పూలు అంటే ఇష్టం. ఆ పూలతో దేవుడిని పూజించడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి.