Site icon HashtagU Telugu

Temple: గుడివైపు వెనుక భాగాన్ని ఎందుకు ముట్టుకోకూడదో మీకు తెలుసా?

Temple

Temple

మామూలుగా మనం తరచుగా గుడికి వెళుతూ ఉంటాం. కొందరు కేవలం పండగలు అలాగే ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే ఆలయాలకు వెళ్తూ ఉంటారు. ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలోనే ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు గుడి వెనుక భాగాన్ని చేతితో తాకుతూ దేవుడికి మొక్కుకుంటూ కోరికలు కోరుతూ ఉంటారు. ఇంకొందరు గుడి వెనుక బాగాన తల ఆన్చి దేవుడికి మొక్కుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడు కూడా గుడి వెనుక భాగాన్ని కాకకూడదు అంటున్నారు పండితులు. మరి గుడి వెనుక భాగాన్ని తాకితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గుడిలోని వెనుక భాగంలో రాక్షసులు ఎక్కువగా ఉంటారు. అందుకే మనం ఆ వైపున తాకితే రాక్షసులను నిద్రలేపినట్లు అవుతుంది. రాక్షసుల ప్రతికూల ప్రభావాలు అన్నీ మనపై పడతాయట. దేవాలయంలోని వెనుక భాగాన్ని తాకి మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే అవి నెరవేరవట. అలాగే ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. వెనుక వైపు తల వాల్చి మొక్కుకోవడం మాత్రమే కాకుండా కనీసం చేయి కూడా తగిలించకూడదని చెబుతున్నారు. అలాగే గుడిలో దేవుడికి వీపు కనిపించేలాగా వెనక్కి తిరిగి కూర్చోకూడదు. అలాగే దేవుడి దర్శనం తర్వాత గుడి నుంచి బయటికి వచ్చే సమయంలో గంట కొట్టకూడదు. అదే సమయంలో గుడికి ఎంతో పవిత్రంగా నియమనిష్టలతో వెళ్ళాలి.

అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలని పండితులు చెబుతున్నారు. భగవంతుని దర్శన భాగ్యం అయినందుకు భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మనసులోని కోరికలు కోరుకోవటంతో పాటు పునర్దర్శన ప్రాప్తి కలగాలని కూడా కోరుకోవాలి. దేవుడిని ప్రార్థించే సమయంలో స్వామివారి ఎదుట ఎప్పుడూ నిలబడకూడదు. ఎల్లప్పుడూ స్వామివారిని కొంచెం పక్కకు నిలబడి మాత్రమే దర్శనం చేసుకోవాలి. ఎప్పుడూ ఎదురుగా నిలబడకూడదు. ప్రసాదం తిన్న తర్వాత ఆ ఎంగిలి చేత్తో దేవుడికి దండం అస్సలు పెట్టకూడదు. అలాగే దేవాలయానికి వెళ్ళాక కాళ్లు కడుక్కున్న తరువాతే అంతరాలయంలోకి ప్రవేశించాలి. ఇలాంటి చిన్న చిన్న నియమనిష్టలు పాటిస్తే భగవంతుని అనుగ్రహాన్ని సులువుగా పొందవచ్చని పండితులు చెబుతున్నారు.