Site icon HashtagU Telugu

Copper Things: పూజా కార్యక్రమాలలో రాగి పాత్రలనే ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలుసా?

Copper Things

Copper Things

మామూలుగా ఇంట్లో అలాగే బయట దేవాలయాల్లో ఎక్కడైనా అయినా సరే పూజా కార్యక్రమాలలో ఎక్కువగా రాగి పాత్రలనే ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమంది బాగా డబ్బు ఉన్నవారు రాఖీ పాత్రలతో పాటుగా వెండి పాత్రలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఎక్కువ శాతం మంది కంచు, ఇత్తడి పాత్రలను వినియోగిస్తూ ఉంటారు. కొందరు స్టీలు పాతులను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే స్టీలు పాత్రలను అసలు ఉపయోగించకూడదని పండితులు చెబుతున్నారు. ఇకపోతే పూజా కార్యక్రమాలలో ఎక్కువగా రాగి పాత్రలను ఎందుకు ఉపయోగిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

దేవాలయాల్లోనూ, గృహాల్లోనూ పూజా కార్యక్రమాల్లో రాగిపాత్రలనే వాడుతుంటారు. దీనికి సంబంధించి వివరాలను భూదేవికి సాక్షాత్తు ఆదివరాహస్వామి వివరించినట్టు వరాహ పురాణం పేర్కొంటుంది. బంగారు వెండి వస్తువులను దేవుళ్ళకు అలంకరించిన, పూజల్లో మాత్రం ఎక్కువగా రాగిపాత్రలనే వాడుతుంటారు. అయితే కొన్ని వేల యుగాలకు పూర్వం గుడాకేశుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను మహావిష్ణువుని నిత్యం కొలిచేవాడు. వైకుంఠధారి అంటే అతనికి ఎంతో భక్తి. ఒక ఆశ్రమంలో రాగి రూపంలో స్వామి కటాక్షం కోసం కఠోరమైన తపస్సు ఆచరించాడు.
కొంత కాలం అనంతరం శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. తనకు ఎలాంటి వరాలు వద్దని తన దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండించి భగవంతునిలో ఐక్యం చేసుకోవాలని గుడాకేశుడు కోరుతాడు.

దాంతో అతని కోరిక నెరవేరుతుందని వరమిస్తాడు. తన శరీరం ద్వారా తయారు చేసిన పాత్రలు పూజలో ఉండాలని ప్రార్థిస్తాడు. అందుకు అనుగ్రహించిన పరంధాముడు వైశాఖ శుక్ల పక్ష ద్వాదశి రోజున అతని కోరిక నెరవేరుతుందని వరమిస్తాడు. తర్వాత కొన్నాళ్లకు ద్వాదశి వచ్చింది. సుదర్శనచక్రం అతని శరీరాన్ని ముక్కలు చేస్తుంది. గుడాకేశుని ఆత్మ వైకుంఠానికి చేరుకుంది. శరీరం రాగిగా రూపొందింది. ఈ రాగి పాత్రలను తన పూజలో ఉపయోగించాలని లక్ష్మీపతి భక్త కోటిని ఆదేశించాడు. అప్పటి నుంచి నారాయణుడి పూజలో రాగిపాత్రలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు పూజలో కేవలం రాగి పాత్రలనే ఉపయోగిస్తూ వస్తున్నారు.

కాగా స్తోమత వుంటే వెండి లేదా బంగారం, లేదంటే ఇత్తడి రాగి పాత్రలను వాడటమే అన్ని విధాలా మంచిదని చెబుతోంది. స్టీలు లేదా ఇనుము శని సంబంధమైన లోహం కనుక, దానికి బదులుగా ఇతరలోహాలతో చేసిన పాత్రలను మాత్రమే పూజకు వాడాలనీ, అప్పుడే ఎలాంటి దోషాలు లేని పరిపూర్ణమైన ఫలితాలను పొందవచ్చని చెబుతున్నారు. గతంలో రాగి చెంబు, రాగి బిందె, రాగి గ్లాసు, రాగి ప్లేటు ఇలా ఎక్కువగా రాగి వస్తువులనే వాడే వారు. కాని నేడు ఫ్యాషన్‌ ఎక్కువయ్యి ప్లాస్టిక్‌ వచ్చిపడింది. దాంతో రాగి పాత్రల వాడకం బాగా తగ్గిపోయింది.