Site icon HashtagU Telugu

Rare Temples : ఏడాదిలో ఒక్కరోజే తెరుచుకునే ఆలయాలు ఇవే

Rare Temples Indian Temples Min

Rare Temples : భారతదేశం ఎన్నో మహిమాన్విత ఆలయాలకు నిలయం.  దేశంలోని  ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. చాలా ఆలయాల్లో ఏడాది పొడవునా ప్రతిరోజూ  దేవతా మూర్తులకు పూజలు జరుగుతుంటాయి. దేవతా మూర్తులను భక్తులు దర్శించుకొని పూజలు చేస్తుంటారు. అయితే కొన్ని ఆలయాలు ఏడాదిలో కొన్ని నెలలే తెరచి ఉంటాయి. ఇంకొన్ని ఆలయాలైతే  ఏడాదిలో ఒక రోజే తెరుచుకుంటాయి. అలాంటి విశిష్ఠ ఆలయాల గురించి మనం తెలుసుకుందాం..

Also Read :Shihan Hussaini : పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ ఇక లేరు

సర్ప రాజు ఆలయం

శ్రీ నాగచంద్రేశ్వర ఆలయం సర్పరాజుకు సంబంధించినది. ఇది మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న శ్రీ మహాకాళేశ్వర ఆలయం రెండో అంతస్తులో ఉంది. ఈ ఆలయం తలుపులు సంవత్సరానికి ఒకసారే తెరుచుకుంటాయి. అది కూడా నాగ పంచమి రోజున మాత్రమే. ఆ టైంలో భక్తులు దర్శనం చేసుకొని పూజలు చేస్తుంటారు.

మంగళదేవి ఆలయం

కర్ణాటకలోని మంగళూరులో ఉన్న బోలారా అనే ప్రదేశంలో మంగళ దేవి ఆలయం ఉంది. ఈ ఆలయం తలుపులను సంవత్సరానికి ఒకసారే తెరుస్తారు.  నవరాత్రి టైంలో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

హాసనాంబ ఆలయం

కర్ణాటకలో హాసనాంబ ఆలయం ఉంది. ఇది అంబా దేవికి అంకితం. దీపావళి సమయంలో మాత్రమే ఈ ఆలయం తలుపులను తెరుస్తారు. 12వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు.

ఏకలింగేశ్వర మహాదేవ ఆలయం

రాజస్థాన్‌లోని  జైపూర్‌లో ఏకలింగేశ్వర మహాదేవ ఆలయం ఉంది. ఈ ఆలయం తలుపులును ఏటా శివరాత్రి రోజున మాత్రమే తెరుస్తారు.

కేదారేశ్వర ఆలయం

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు(Rare Temples) సమీపంలో కేదారేశ్వర ఆలయం ఉంది.  ప్రాచీన కాలంలో జరిగిన యుద్ధాలలో ఈ ఆలయంలోని శివలింగం ధ్వంసమైంది. దీంతో ఆలయం మూత పడింది. అప్పటి నుంచి ఈ ఆలయాన్ని ఏటా మహా శివరాత్రి రోజున మాత్రమే తెరుస్తారు.

శ్రీ రామలింగేశ్వర స్వామి

యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిల్లాపురంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. స్వామివారు స్వయంభువుగా వెలిసిన ఈ ఆలయాన్ని కూడా ఏడాదిలో ఒక్క రోజే తెరుస్తారు. ఏటా కార్తిక పౌర్ణమి రోజున ఈ ఆలయం తలుపులను తెరుస్తారు.