అమావాస్య రోజు ఇంటి ముందు ముగ్గు వేయకూడదా.. వేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

హిందూ సంప్రదాయం ప్రకారం మామూలుగా స్త్రీలు ఇంట్లో ఉదయం లేవగానే కల్లాపు చల్లి ఇంటి ముందు ముగ్గు పెట్టి ఆ తర్వాత పనులు చేసుకుంటూ ఉంటారు. ఇలా ఇం

  • Written By:
  • Publish Date - February 12, 2024 / 02:00 PM IST

హిందూ సంప్రదాయం ప్రకారం మామూలుగా స్త్రీలు ఇంట్లో ఉదయం లేవగానే కల్లాపు చల్లి ఇంటి ముందు ముగ్గు పెట్టి ఆ తర్వాత పనులు చేసుకుంటూ ఉంటారు. ఇలా ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గులు పెట్టడం అన్నది ఎప్పటినుంచో వస్తున్న ఆ సాంప్రదాయం. దాని వెనుక సైన్స్ కూడా దాగి ఉంది. ఈ విధంగా ప్రతి రోజు ఉదయం లేవగానే ముగ్గులు పెట్టడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని భావిస్తారు.

పట్టణంలో ఉన్న వారు సైతం చిన్న చిన్న ముగ్గులు వేస్తూ ఉంటారు. కానీ అమావాస్య రోజున మాత్రం ముగ్గులు వేయకూడదని పండితులు చెబుతున్నారు. అమావాస్య రోజు ముగ్గులు ఎందుకు వేయకూడదో, అలా వేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అమావాస్య ముందు రోజున మన ఇంటికి పితృదేవతలు వస్తారని భావిస్తారు. అందుకోసమే పితృదేవతలకు ఆర్ఘ్యం ఇస్తే వారు సంతోషం చెంది మనకు ధనాభివృద్ధి, సంతాన వృద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. కనుక అమావాస్య రోజు ఇంటి ముందు శుభ్రం చేసి పెట్టాలి కానీ ముగ్గులు వేయకూడదట. ఒకవేళ ఇంటి ముందు ముగ్గులు వేస్తే పితృదేవతలు రాకుండా ఆగిపోతారట.

అమావాస్య రోజున పితృదేవతలను మనసారా ప్రార్థించాలి అంటే ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు. అమావాస్య అంటే పితృదేవతలకు ఎంతో ప్రీతికరమైన రోజు. అందుకోసమే అమావాస్య రోజు పితృ దేవతలకు ప్రత్యేక పూజలు చేయటం వల్ల ఉంది వారి ఆత్మకు శాంతి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.