Ravana: రావణాసురుడికి పది తలలు ఉండడం వెనుక ఉన్న రహస్యం ఇదే?

రామాయణం తెలిసిన ప్రతి ఒక్కరికి రావణాసురుడు గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది. అయితే అందులో రావణుడికి 10 తలలు ఉంటాయి అన్న విషయం

Published By: HashtagU Telugu Desk
Ravana

Ravana

రామాయణం తెలిసిన ప్రతి ఒక్కరికి రావణాసురుడు గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది. అయితే అందులో రావణుడికి 10 తలలు ఉంటాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే రావణుడికి అలా పది తలలు ఎందుకు ఉంటాయి అన్న సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది. మరి దాని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రావణుడు బలశాలి, తపశ్శాలి. సనకసనందనాది రుషుల శాప ప్రభావంతో వైకుంఠ ద్వారపాలకులైన జయవిజయులే త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణులుగా జన్మించారని అంటారు. ఇక విచిత్ర రామాయణ ప్రకారం..

విశ్వవసు ఒక రోజు దాంపత్య సుఖాన్ని అనుభవించాలన్న కోరికతో తన భార్య కైకసి వద్దకు వెళ్తాడు. అప్పటికే ఆమె 11 సార్లు రుతుమతి అయినట్లు విశ్వవసు తెలుసుకుంటాడు. ఆమె ద్వారా 11 మంది పుత్రులను పొందాలని విశ్వవసు భావిస్తాడు. అయితే కైకసి మాత్రం తనకు ఇద్దరు పుత్రులే కావాలని విశ్వవసుకు చెబుతుంది. తపోనిధి అయిన విశ్వవసు తన మాట వృథా కాకుండా ఉండటానికి10 తలలు ఉన్న రావణుడినీ, పదకొండో వాడిగా కుంభకర్ణుడినీ ఇచ్చాడని విచిత్ర రామాయణం కథ. విష్ణుమూర్తి నరసింహ అవతారంలో ఉద్భవించి హిరణ్యకశిపుడిని చంపాడు. అయితే తనను సంహరించే సమయంలో.. అకస్మాత్తుగా పుట్టి, ఇరవై గోళ్లతో నన్ను ఒక్కణ్ని చంపడం కూడా ఓ పౌరుషమేనా అని ఆక్షేపించాడట హిరణ్యకశిపుడు.

అప్పుడు శ్రీహరి తర్వాత జన్మలో నీకు 10 తలలు, 20 చేతులు ప్రసాదించి, మానవుడిగా అవతరించి సంహరిస్తాను అని విష్ణుమూర్తి అన్నాడని మరో కథ ప్రచారంలో ఉంది. వాల్మీకి రామాయణంలో వీటి ప్రస్తావన లేదు. రావణుడికి కామరూప విద్యతో 10 తలలు ఏర్పడ్డాయని కొందరు చెబుతారు. రావణాసురుడు కోరుకున్నప్పుడు 10 తలలు, 20 చేతులు వస్తాయి. అలాగే 5 కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు.. మొత్తం 10 ఇంద్రియాలు ఉంటాయి. వీటిని అదుపులో పెట్టుకోవడం ఆధ్యాత్మిక సాధనకు బలాన్ని ఇస్తుంది. 10 ఇంద్రియాలకు లొంగిపోయినవాడే దశకంఠుడు అని పెద్దలు అంటారు.

  Last Updated: 05 Sep 2023, 09:04 PM IST