Ramadan: నేటి నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు

  • Written By:
  • Publish Date - March 11, 2024 / 09:04 PM IST

Ramadan: రంజాన్‌ పండుగను ఈదుర్‌ ఫితర్‌ అని అంటారు. నెల పొడుపు చంద్రుని దర్శించిన తరువాత రోజు ఉదయం పండుగను జరుపుకొంటారు. పండుగ ప్రార్థనలను ఈద్గాలోనే జరుపుతారు. నమాజ్‌ అనంతరం ముస్లింలు, ముస్లిమేతరులు ఒకరినొకరు స్నేహాభావం పెంపొందించుకొనుటకు ‘అలయ్ బలయ్, ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలను తెలుపుకొంటారు. పండుగ రోజు షీర్‌ ఖుర్మా అనబడే మధురమైన సేమియాను తప్పక వండుతారు, ఆత్మీయులకు తినిపిస్తారు. నేటితో వీరి నెలరోజుల ఉపవాస దీక్ష పూర్తవుతుంది. ఖురాన్ సిద్దాంతం ప్రకారం తాము సంపాదించిన దానిలో పేదవారి కొరకు కనీసం నూటికి రెండు రూపాయలు అయినా దానధర్మం చేయాలని భావిస్తారు, పండ్లు, గోధుమలు, సేమియా, బట్టలు, బంగారం మొదలినవి దానం చేయాలని ఖురాన్‌ చెబుతోంది.

రంజాన్‌ నెలలో ఇలా దానం చేస్తే నిరుపేద వారు కూడా పండుగ పూట సంతోషంగా ఉంటారని ముస్లిం పెద్దలు చెబుతుంటారు. ఈ దానధర్మ గుణం ,భక్తి భావాన సంవత్సరం మొత్తం అనుసరించాలని పవిత్ర రంజాన్ నెలతో ప్రారంబిస్తారు. ఆకలి అంటే ఎంత కఠీనంగా ఉంటుందో స్వయంగా అనుభవిస్తే తప్ప అనుభవంలోకి రాదు అనే భావనతో ఈ రంజాన్ ‘రోజా’ ఉపవాసదీక్షలు అనే సూత్రాన్ని ప్రతిపాదించారు.

లోకంలో ఎంతో మంది అభాగ్యులు, నిరుపేదలు ఆకలితో అలమటిస్తూ దుర్భరమైన జీవితాలను వెల్లబుచ్చుతున్న వారి కొరకు మానవత్వంతో విధిగా తమ సంపాదనలో కొంత శాతం కేటాయించి సాటివారికి దాన ధర్నాలు చేయాలి అని సూచించారు, మనకు ఆకలి వేస్తే భరించడం ఎంత కష్టమో ‘రోజా’ ఉపవాసం ద్వార తెలియజేసి సాటి నిరుపేదలకు దానధర్మాలు చేయమని పవిత్ర ఖురాన్ సూచిస్తుంది. మానవీయ విలువలను తెలియజేసే పవిత్ర ఖురాన్ గ్రంధాన్ని తప్పకుండా ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరు చదవాలి, లేదా వినాలి అనే నియమమం కుడా ఉంది.