Site icon HashtagU Telugu

Hanuman : హనుమంతుడు లేని రామయ్య గుడి ఎక్కడో ఉందో తెలుసా..?

Vontimitta Ramalayam Temple

Vontimitta Ramalayam Temple

రామాలయాల్లో (Ram Temple) సాధారణంగా సీత, రామ, లక్ష్మణులతో పాటు భక్త హనుమంతుని విగ్రహం (Hanuman Statue) ఉండటం మనం తరచూ చూస్తుంటాం. కానీ ఆ సంప్రదాయానికి భిన్నంగా ఒంటిమిట్ట రామాలయం ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక్కడి మూలవిగ్రహంలో ఒకే శిలపై సీత, రాముడు, లక్ష్మణుడు మాత్రమే కనిపిస్తారు. హనుమంతుని విగ్రహం మాత్రం అక్కడ ఉండదు. పూర్వకాలంలో మునులు యాగాలు నిర్వహిస్తుండగా, రాక్షసుల వల్ల వారి శాంతి భంగమవుతోంది. అప్పుడు వారు శ్రీరాముని ఆశ్రయించగా, ఆయన కోదండం, బాణాలు ధరించి యాగాలను రక్షించేందుకు అక్కడే ప్రత్యక్షమయ్యాడు. అప్పటికి హనుమంతునితో రాముడికి పరిచయం కాకపోవడం వల్ల ఆ విగ్రహంలో హనుమంతుడు కనిపించడని ఆలయ పురోహితులు చెపుతుంటారు. ఇది ఇతిహాసపరంగా ఒక ప్రత్యేక ఘట్టం.

Assassination Files: రాబర్ట్ ఎఫ్ కెనడీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యల ఫైళ్లు.. ఎలా చంపారు ?

ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా ఒంటిమిట్ట గ్రామంలో ఉన్న శ్రీ కొదండరామాలయం ఒక ప్రాచీనమైన, ఆధ్యాత్మికంగా ఎంతో మహిమ కలిగిన రామాలయం. ఈ ఆలయం రాయలసీమలోనే కాక, దక్షిణ భారతదేశంలోనే గొప్ప శిల్పకళతో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటి. కొండలు, ప్రకృతి అందాలతో నిండి ఉన్న ఈ ప్రదేశం, భక్తులకు శాంతి, ప్రశాంతతను అందిస్తుంది. ఒంటిమిట్ట రామాలయాన్ని 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలో పాలించిన రాజులు నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలోని శిల్పకళ, శృంగార రేఖలు, గోపురాలు విజనగర శైలికి చెందిన ముఖ్యాంశాలుగా నిలుస్తాయి. ఈ ఆలయంలో శ్రీ రాముడు, సీతాదేవి, లక్ష్మణులు ఒకే శిలపై చెక్కబడి ఉన్నారు ఇది ప్రత్యేకతగా చెప్పుకోదగ్గ అంశం.