Ram Mandir: 2024 డిసెంబర్ నాటికి రామ మందిరం పూర్తి

రామ మందిరంలో ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులన్నీ డిసెంబర్ 2024 నాటికి పూర్తవుతాయని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. రామ మందిరంలో నిర్మాణ పనులు పూర్తి చేయడానికి

Ram Mandir: రామ మందిరంలో ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులన్నీ డిసెంబర్ 2024 నాటికి పూర్తవుతాయని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. రామ మందిరంలో నిర్మాణ పనులు పూర్తి చేయడానికి ఇదే గడువుగా నిర్ణయించింది. ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా మాట్లాడుతూ.. మందిరం లోపల కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉందని, కాస్త సమయం పట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది వచ్చే చివరి నాటికీ మిగతా పనులన్నీ పూర్తవుతాయని తెలిపారు.

రామజన్మభూమి మందిరం లోపల భక్తుల కోసం వివిధ సౌకర్యాలతో పాటు మరో పన్నెండు ఆలయాలు అందుబాటులోకి రానున్నాయి. మందిరం పూర్తిగా పూర్తయితే ఈ ఆలయం 161 అడుగుల ఎత్తు, 235 అడుగుల వెడల్పు, 360 అడుగుల పొడవు ఉంటుంది. నిర్మాణ పనులకు సంబంధించి ట్రస్ట్ చాలా నిబద్దతో పని చేస్తున్నదని , నెమ్మదిత్వం లేకుండా పనులు త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాదని ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా అన్నారు.

Also Read: Harirama Jogaiah : దేహీ అనడం పొత్తు ధర్మమా..? పవన్ కు హరి రామజోగయ్య లేఖ..