Site icon HashtagU Telugu

Ram Navami 2023: శ్రీరామనవమి రోజున 5 అరుదైన యోగాలు.. ఆ తర్వాత గజకేసరి రాజయోగం వివరాలివీ..!

Sriramanavami

Sriramanavami

శ్రీరామనవమి (Ram Navami 2023) వేడుక మార్చి 30న ఉంది. ఆ రోజున 5 అరుదైన యోగాలు సంభవించబోతున్నాయి. అవి.. శుభ యోగం, గురు పుష్య యోగం, అమృత సిద్ధి యోగం, రవియోగం, సర్వార్థ సిద్ధి యోగం. రామ నవమి రోజున ఈ ఐదు యోగాలు ఉండటం వల్ల శ్రీరాముని ఆరాధన వల్ల శీఘ్ర ఫలితాలు వస్తాయి. ఈ రోజున చేసే అన్ని కార్యాలలో కార్యసిద్ధి, విజయం లభిస్తుంది.

■ అరుదైన యోగాలు , సమయాలు

★ గురు పుష్య యోగం – మార్చి 30వ తేదీన ఉదయం 10.59 నుంచి – మార్చి 31న ఉదయం 06.13 గంటల వరకు

★అమృత సిద్ధి యోగా – మార్చి 30న ఉదయం 10.59 గంటల నుంచి మార్చి 31న ఉదయం 6.13 గంటల వరకు..

★సర్వార్థ సిద్ధి యోగం – రోజంతా

★రవియోగం – రోజంతా

★ గురువారం – శ్రీరాముడు విష్ణువు యొక్క 7వ అవతారం . గురువారం విష్ణుమూర్తికి చాలా ప్రియమైనది. ఇలాంటి పరిస్థితుల్లో గురువారం రామజన్మోత్సవం కూడా జరగనుండటంతో దీని ప్రాధాన్యత మరింత పెరిగింది.

■ శుభ ముహూర్తాలు ఇవీ

చైత్ర మాసంలోని శుక్ల పక్షం తొమ్మిదవ రోజున శ్రీరాముని జన్మదినోత్సవం జరుపుకుంటారు.  చైత్ర నవరాత్రులలో ఇది తొమ్మిదవ, చివరి రోజు. రామ నవమి 2023 శుభ సమయం.. చైత్ర మాసం శుక్ల పక్ష నవమి తేదీ మార్చి 29న రాత్రి 09.07 గంటలకు ప్రారంభమవుతుంది. నవమి తిథి మార్చి 30, 2023 రాత్రి 11.30 గంటలకు ముగుస్తుంది.రామ్ లల్లా ఆరాధన కోసం ముహూర్తం మార్చి 30న ఉదయం 11:17 నుంచి మధ్యాహ్నం 01:46 వరకు ఉంది.
అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12.01 – 12.51 గంటల మధ్య ఉంటుంది.

■రామ నవమి నాడు ఏమి చేయాలి?

రామ నవమి నాడు శుభ సమయంలో కుంకుమ కలిపిన పాలతో శ్రీరామునికి అభిషేకం చేయండి. తర్వాత ఇంట్లో రామాయణం పఠించండి.  రామాయణం ఎక్కడ పఠించ బడుతుందో అక్కడ శ్రీరాముడు, హనుమంతుడు నివసిస్తారు అని చెబుతారు.  దీంతో ఇంట్లో ఆనందం వెల్లి విరుస్తుంది. సంపద, శ్రేయస్సు పెరుగుతుంది.రామ నవమి రోజున ఒక గిన్నెలో గంగా జలం వేస్తూ రామ్ రక్షా మంత్రం ‘ఓం శ్రీ హ్రీ క్లీం రామచంద్రాయ శ్రీ నమః’  108 సార్లు జపించండి . ఆ తర్వాత ఇంటిలోని ప్రతి మూల, పైకప్పు మీద ఆ నీటిని చల్లుకోండి. దీని వల్ల ఇంటి వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఫలితంగా చేతబడి ప్రభావం కూడా ఇంటిపై, ఇంటిలోని వారిపై ఉండదని నమ్ముతారు.

■ ఆ 3 రాశుల వాళ్లకు

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, మొత్తం తొమ్మిది గ్రహాలు కాలానుగుణంగా తమ రాశిని మార్చుకుంటాయి. అంతేకాకుండా ఇవి శుభ, అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. ఏప్రిల్ 22న బృహస్పతి మీనరాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశించనుంది. ఈ రాశిలో బృహస్పతి, చంద్రుడు కలయిక వల్ల అరుదైన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల మేషం, మిథునం, ధనుస్సు రాశుల వారికి అపారమైన ధనం, వ్యాపారంలో లాభం కలుగుతాయి.

Exit mobile version