Site icon HashtagU Telugu

Odisha : రేపు మరోచోట కూడా రామాలయం ప్రారంభం..

Odisha Rammandir

Odisha Rammandir

అయోధ్య (Ayodhya) రామాలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం రేపు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ వ్యాప్తంగా భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఇప్పటికే ప్రారంభోత్సవ కార్యక్రమములు పూర్తి అయ్యాయి. VIP ల తాకిడి కూడా మొదలైంది. దేశం మొత్తం కూడా రామస్మరణ తో మారుమోగిపోతుంది. ఇదిలా ఉంటె రేపు మరోచోట కూడా రామాయలం ప్రారంభం కాబోతుంది. నారాయణ్‌ గఢ్‌ జిల్లా, ఫతేగఢ్‌ గ్రామంలో నిర్మితమైన రామాలయం ప్రారంభోత్సవం రేపు ( సోమవారం) జరగనున్నది. 2017 లో దీని నిర్మాణం మొదలుపెట్టడం జరిగింది. 165 అడుగుల ఎత్తులో కొండపై దీనిని నిర్మించారు.

ఇక అయోధ్య రామాయలం విషయానికి వస్తే..

We’re now on WhatsApp. Click to Join.

అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందడి ఆకాశాన్నంటుతోంది. నగరమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంది. అయోధ్య నగరం మొత్తం రామస్మరణ తో మారుమోగిపోతుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఘట్టానికి రేపటితో తెరపడనుండడం తో భక్తులంతా సంతోషంలో మునిగితేలుతున్నారు. బాల రాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ మహోత్సవం నేపథ్యంలో రకరకాలైన పూలతో చేసిన అలంకరణలు, విద్యుత్‌ దీపాల కాంతులతో ఇక్కడి రామమందిరం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఆలయాన్ని, పరిసరాలను దేశం నలుమూలల నుంచి తెప్పించిన విభిన్న రకాలైన పుష్పాలతో సుందరంగా అలంకరించారు.

శ్రీరామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అయోధ్య రామాలయాన్ని నిర్మించగా.. ఈ మహా క్రతువులో ఎందరెందరో భాగస్వాములయ్యారు. వీరిలో శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ఇస్రో కూడా కీలక సహకారాన్ని అందించింది. గర్భాలయ స్ట్రక్చరల్‌ డిజైన్లను, ఆలయ పునాదులను ‘సూర్య తిలక్‌’ సంస్థ రూపొందించింది. ఆలయ నమూనాలను చంద్రకాంత్‌ సోంపుర రూపొందించారు. ఈయన వంశీయులు 15 తరాలుగా ఆలయ నిర్మాణ నమూనాలను రూపొందించగా.. వీరి సహకారంతో 100కు పైగా దేవాలయాలు రూపుదిద్దుకున్నాయి.

Read Also : Fake Collections : ఫేక్ కలెక్షన్స్.. నిర్మాతలు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని..!