Raksha Bandhan: రాఖీ ఏ సమయంలో కట్టాలి..? శుభ ముహూర్తం ఎప్పుడంటే..?

దేశవ్యాప్తంగా జరుపుకునే ముఖ్యమైన పండుగలలో రక్షాబంధన్ (Raksha Bandhan) ఒకటి (రాఖీ పండగ). సోదరసోదరీమణులు ప్రేమకు ప్రతీకగా ఈ పండగను జరుపుకుంటారు.

  • Written By:
  • Publish Date - August 29, 2023 / 07:52 AM IST

Raksha Bandhan: దేశవ్యాప్తంగా జరుపుకునే ముఖ్యమైన పండుగలలో రక్షాబంధన్ (Raksha Bandhan) ఒకటి (రాఖీ పండగ). సోదరసోదరీమణులు ప్రేమకు ప్రతీకగా ఈ పండగను జరుపుకుంటారు. దీనినే రాఖీ పౌర్ణమి, రాఖీ పండుగ అని రకరకాల పేర్లుతో పిలుస్తారు. ఈ వేడుకను శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటారు. రక్షాబంధన్ నాడు రాఖీని శుభ ముహూర్తంలో మాత్రమే కట్టాలి, లేకుంటే అశుభ ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం ఈ పండుగ ఎప్పుడు వచ్చింది, రాఖీ కట్టడానికి శుభ సమయం ఎప్పుడు తదితర విషయాల గురించి తెలుసుకుందాం.

రాఖీ కట్టడానికి శుభ సమయం

సాధారణంగా ఏ శుభ కార్యమైనా శుభ ముహూర్తంలో చేస్తేనే విజయవంతమవుతుంది. అలాగే రాఖీని కూడా మంచి ముహూర్తంలో కట్టడం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఈ ఏడాది పౌర్ణమి ఆగస్టు 30 ఉదయం 10:59 గంటలకు ప్రారంభమై ఆగస్టు 31న ఉదయం 07:06 గంటలకు ముగుస్తుంది. ఇది భద్రకాలంలో వచ్చింది. ఈ సమయంలో రాఖీ కట్టకూడదు. మీరు రాఖీ కట్టడానికి శుభ సమయం ఆగస్టు 30వ తేదీ రాత్రి 09:02 నుండి ఆగస్టు 31వ తేదీ ఉదయం 07:06 గంటల వరకు. అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు ఎంత దూరం ఉన్నా ఈ రాఖీ పండగ రోజు కలిసి రాఖీ కట్టుకుంటే వారి అనుబంధం మరింత బలపడుతుంది. అలాగే మీ సోదరికి చిరు కానుక ఇవ్వడం మరిచిపోకండి.

Also Read: Telugu Language Day 2023 : అమ్మ ప్రేమలా కమ్మనైనది తెలుగు భాష

పురాణాల ప్రకారం.. సూర్య దేవుని పుత్రిక భద్ర రాక్షసులను నాశనం చేయడానికి జన్మించింది. తన పుట్టినప్పుడే విశ్వం మొత్తాన్ని తన స్వరూపం మార్చుకోవడం ప్రారంభించింది. ఈ సమయంలో శుభకార్యాలు, యాగాలు, క్రతువులు ఎక్కడ జరిగినా అక్కడ ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ కారణంగా భద్ర కాలంలో ఎలాంటి శుభ కార్యాలు జరగవు. వైదిక పంచాంగం ప్రకారం.. భద్ర మూడు లోకాలలో అంటే స్వర్గం, పాతాళం, భూమిలో ఉంటారు. అలాగే చంద్రుడు, కర్కాటకం, సింహ, కుంభ, మీన రాశుల్లోనూ ఉంటుంది. అందుకే ఈ కాలంలో ఎలాంటి పనులు చేపట్టినా విజయవంతంగా పూర్తి కావు.