Site icon HashtagU Telugu

Brahma Temple: బ్రహ్మ దేవుడికి కూడా ఆలయం ఉందని తెలుసా.. కానీ వారికి మాత్రం నో ఎంట్రీ!

Brahma Temple

Brahma Temple

ఆరావళి పర్వత శ్రేణిలో ఉన్న ఒక అద్భుతమైన నగరం పుష్కర్. దీని ప్రత్యేక గుర్తింపుతోనే ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుని ఉన్న అతి తక్కువ ఆలయాల్లో ప్రపంచ ప్రసిద్దిగాంచిన ఆలయం ఇక్కడ ఉండటమే కారణం అని చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే పుష్కర్ కుంభమేళా ఈ ప్రదేశానికి ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను మరింత పెంచుతుందట. పుష్కర్ లో అతిపెద్ద ఆకర్షణ నిస్సందేహంగా బ్రహ్మ దేవుడి ఆలయం. బ్రహ్మ దేవుడిని పూజించే ఆలయం చాలా ప్రత్యేకమైనది. పురాణాల ప్రకారం బ్రహ్మ దేవుడు యజ్ఞం చేసాడు. దీని కారణంగా ఈ ప్రదేశానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

ఎరుపు రంగు శిఖరం, పాలరాయితో నిర్మించబడిన ఈ ఆలయం దీని నిర్మాణ శైలితో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని చెబుతున్నారు. ఆలయ గర్భగుడిలో చతుర్ముఖుడైన బ్రహ్మ దేవుడి అందమైన విగ్రహం ప్రతిష్టించబడింది. ఇక్కడ ఉన్న బ్రహ్మ దేవుడిని దర్శించుకోవడం కోసం చుట్టుపక్కల వారితో పాటు సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఈ ఆలయ సముదాయంలో ఇతర దేవుళ్ళు, దేవతల చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. ఇవి ఈ ప్రదేశం పవిత్రతను మరింత పెంచుతున్నాయి. ఈ ఆలయం శతాబ్దాలుగా భక్తుల విశ్వాసానికి కేంద్రంగా ఉంది. పుష్కర్ సరస్సులో స్నానం చేసి బ్రహ్మదేవుని దర్శనం చేసుకోవడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయని అక్కడి భక్తుల నమ్మకం.

ఇకపోతే ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక పూజలకు లక్షలాది మంది వస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని 14వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు పునర్మించారు. బ్రహ్మ దేవుడు పుష్కర్ సరస్సు ఒడ్డున యజ్ఞం చేశాడని అలా యజ్ఞం చేసే సమయంలో సరస్వతి దేవి లేకపోవడంతో గాయత్రి దేవిని వివాహం చేసుకున్నాడని చెబుతారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సరస్వతి దేవి తన భర్త చేసిన పనికి కోపగించి బ్రహ్మ దేవుడికి శాపం ఇచ్చిందట. అంతేకాదు ఈ ఆలయంలోకి వివాహిత పురుషుడు వెళ్ళకూడదట. అంటే పెళ్లి అయిన మగవారు వెళ్లకూడదని, ఒకవేళ వెళ్తే దంపతుల మధ్య వివాదాలు నెలకొంటాయని నమ్మకం. అందువల్ల ఈ ఆలయాన్ని ప్రాంగణం నుంచి మాత్రమే పురుషులు దర్శించుకుంటారు. వివాహిత స్త్రీలు లోపలికి వెళ్లి పూజించవచ్చు. ఇక్కడ సరస్వతి దేవి ఆలయంలో విగ్రహం కోపంగా ఉన్నట్లు కనిపిస్తే గాయత్రీ దేవి సరస్వతి దూరంగా ఉన్న ఆలయం ఉంది. కార్తీక మాసంలో నిర్వహించబడే ఈ ఉత్సవంలో వేలాది ఒంటెలు, గుర్రాలు, ఇతర జంతువుల వ్యాపారం జరుగుతుంది. ఈ ఉత్సవం రాజస్థానీ సంస్కృతిని ప్రదర్శిస్తుంది. దీనిలో జానపద సంగీతం, నృత్యం, సాంప్రదాయ కళల అద్భుతమైన సంగమం కనిపిస్తుందట. పుష్కర్ కార్తీక మేళా అనేది ఒక పెద్ద ఆధ్యాత్మికం, సాంస్కృతిక కార్యక్రమం. అందుకనే దీనిని కుంభమేళాలతో పోల్చారు. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు పుష్కర్ సరస్సు ఒడ్డున పవిత్ర స్నానాలు ఆచరిస్తారట.