Rain Water: మామూలుగా జీవితంలో ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్యలు కష్టాలు అన్నది రావడం సహజం. అయితే ఎంత కష్టపడి సంపాదించినా కూడా చేతిలో డబ్బులు మిగలకపోగా, అదనంగా అప్పులు చేయాల్సి వస్తుందని చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాగే ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వెంటాడుతున్నాయని బాధపడుతుంటారు. ఈ సమస్యల నుంచి బయటపడటం కోసం చాలామంది ఎన్నెన్నో పూజలు, పరిహారాలు, దానధర్మాలు వంటివి చేస్తూ ఉంటారు.
అయినప్పటికీ కొన్నిసార్లు మంచి ఫలితాలు కనిపించవు. కానీ వర్షపు నీటితో ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే తప్పకుండా ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు పండితులు. వర్షపు నీటితో పరిహారాలు ఏంటి అని అనుకుంటున్నారా, అవునండోయ్ జ్యోతిషశాస్త్రంలో వర్షపు నీటితో చేసే కొన్ని చర్యల గురించి ప్రత్యేకంగా ఉంది. ధనం, వ్యాపారం, వాణిజ్యానికి సంబంధించిన సమస్యలు తొలగిపోవచ్చట. అయితే ఈ చర్యలు తీసుకునేటప్పుడు మీరు మీ ప్రయత్నాలను కూడా కొనసాగించాలట. వ్యాపారంలో నిరంతరం నష్టం వస్తూ ఉంటే, మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవీ ఫలించకపోతే, వర్షపు నీటిని ఇత్తడి పాత్రలో సేకరించి, ఏకాదశి రోజున ఆ నీటితో లక్ష్మీదేవి, విష్ణుమూర్తికి అభిషేకం చేయాలట.
దీనివల్ల లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుందని, మీ ప్రయత్నాల్లో వేగం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా డబ్బు కొరత అలాగే ఉంటే లేదా ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటే, వర్షపు నీటిని ఒక పాత్రలో సేకరించాలి. వర్షం ఆగిన తర్వాత ఎండ వచ్చినప్పుడు ఆ నీటిని ఎండలో ఉంచాలట. తరువాత దేవుడిని స్మరిస్తూ ఈ నీటిని మామిడి ఆకుల్లో వేయాలట. కష్టపడినా ఆర్థిక పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల లేకపోతే లేదా డబ్బు నీళ్లలా ఖర్చవుతుంటే, మీరు ఈ పరిహారం చేయవచ్చట. వర్షం ప్రారంభమైనప్పుడు ఒక మట్టి కుండను బయట పెట్టాలి. కుండ వర్షపు నీటితో నిండినప్పుడు, దానిని ఇంటి ఉత్తర దిశలో లేదా ఉత్తర, తూర్పు అంటే ఈశాన్య మూలకు మధ్యలో ఉంచాలట. ఇది ధన వ్యయాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు.
Rain Water: ఇంట్లో కష్టాలు,ఆర్థిక సమస్యలతో సతమతవుతున్నారా.. అయితే వర్షపు నీటితో ఇలా చేయాల్సిందే!

Rain Water