Site icon HashtagU Telugu

Rain On Wedding Day: మీ పెళ్ళిలో కూడా వర్షం పడిందా.. అయితే అది శుభమా లేక అశుభమా?

Rain On Wedding Day

Rain On Wedding Day

‎Rain On Wedding Day: మామూలుగా ఎప్పుడైనా వివాహాలు జరిగే సమయంలో వర్షాలు పడుతూ ఉంటాయి. అయితే ఎంత మంచిగా వివాహ ముహూర్తాలు చూసినప్పటికీ ప్రకృతిలో జరిగే వైపరీత్యాలకు ఎవరు కూడా ఏమి చేయలేరు. అది ఎవరి ఆధీనంలో కూడా ఉండదు. అయితే వర్షాకాలం సమయంలో అలాగే ఇంకా కొన్ని కొన్ని సందర్భాలలో వివాహాలు జరిగే సమయంలో వర్షాలు వచ్చి చాలా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. పెళ్లి రోజున అకస్మాత్తుగా వర్షం కురిస్తే ఏర్పాట్లన్నీ వృధా అవుతాయట.

‎పెళ్లి రోజున వర్షం కురవడం ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ జ్యోతిష్యం ప్రకారం కొన్ని సంస్కృతులలో దీనిని శుభానికి చిహ్నంగా భావిస్తారట. వర్షం వాతావరణాన్ని ఎలా శుభ్రపరుస్తుందో, అదేవిధంగా పెళ్లి రోజున వర్షం కురవడం శుద్ధికి చిహ్నం అని చెబుతున్నారు. ఇది వరుడు, వధువుల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని సూచిస్తుందట. కొన్ని సంప్రదాయాల్లో, ఎవరి పెళ్లిలో అయితే వర్షం కురుస్తుందో వారికి త్వరలో సంతానం కలుగుతుందని నమ్ముతారు. అందుకే పెళ్లి రోజున వర్షం కురవడం వరుడు, వధువులకు ఆశీర్వాదం లాంటిదని చెబుతున్నారు.

‎అలాగే పెళ్లి రోజున కురిసిన వర్షం సంబంధాల బలానికి కూడా చిహ్నంగా భావించాలట. ఎందుకంటే హిందూ ధర్మంలో వర్షాన్ని సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వర్షపు స్వచ్ఛమైన బిందువులు ప్రతికూలతను దూరం చేస్తాయని, దంపతులు సానుకూల వాతావరణంతో వారి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారని చెబుతున్నారు. అలాగే తెలుగు సాంప్రదాయంలో, పెళ్లి రోజు వర్షం కురవడం సాధారణంగా శుభ సంకేతంగానే పరిగణిస్తారు. వర్షం సమృద్ధి, ఫలవంతం, దైవ కృపకు చిహ్నంగా చూస్తారట. ఇది నీటి ద్వారా సంతోషం, శ్రేయస్సు, కొత్త జీవితం యొక్క ప్రారంభాన్ని సూచిస్తుందట. సీతారాముల కళ్యాణం జరిగిన రోజు కూడా మేఘం వర్షిస్తుంది. ఎందుకంటే రామయ్య ఆకాశానికి చిహ్నం, సీతమ్మ పుడమికి చిహ్నం. ఇది సృష్టి ప్రక్రియతో పోల్చుతారట. ఆకాశం నుంచి వాన చినుకు పుడమిని చేరుకుంటుంది. ఆ చినుకు నేల కురిసినప్పుడే ప్రకృతి పులకరిస్తుంది. అందుకే సీతారాముల కళ్యాణం లోక కళ్యాణాన్ని సూచిస్తుందని చెబుతున్నారు..

Exit mobile version