రాహు గ్రహ సంచారం వల్ల 4 రాశుల జాతకులకు కష్టాలు రాబోతున్నాయి. ఇప్పటికే ఆ నాలుగు రాశుల వారికీ కష్టాలు మొదలయ్యి ఉంటాయి. రాహువు మేష రాశి నుంచి మీనరాశి లోకి ప్రవేశించాడు. దానివల్ల నాలుగు రాశుల వారికి రాబోయే 18 నెలలు అనగా 2025 వరకు అష్ట కష్టాలు తప్పవు. ఇంతకీ ఆ రాశులు ఏవి అన్న విషయానికి వస్తే…
ధనస్సు రాశి.. ధనస్సు రాశి వారికి రాహు సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ఈ సమయంలో స్థలాలు కొనుగోలు చేయడం, స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు. అలాగే ఇంట్లో కూడా కలహాలు మొదలవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య తగాదా వాతావరణం ఏర్పడుతుంది. ఏదైనా పని తలపెడితే అది చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మరింత అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ పరంగా చిక్కులు ఎదుర్కోవచ్చు. అదే సమయంలో ఆరోగ్యం పై కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి.
మేష రాశి.. మేష రాశి వారికి కూడా 2025 వరకు సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. రాహువు 12వ ఇంట్లోకి ప్రవేశించి ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపిస్తాడు. అటువంటి సమయంలో ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఎంత సంపాదిస్తున్నప్పటికీ చేతిలో డబ్బులు నిలవడం కాస్త కష్టమే. చదువుకునే విద్యార్థులపై కూడా రాహువు తీవ్ర ప్రభావం చూపిస్తాడు. కాబట్టి విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది. అలాగే పెళ్లి అయినా వారు వైవాహిక జీవితం సమస్యల సుడిలో చిక్కుకునే ప్రమాదం ఉంది. జీవిత భాగస్వామితో విభేధాలు తలెత్తవచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఉండడం మంచిది.
సింహ రాశి.. సింహ రాశి వారికి కూడా ఈ సమయం అశుభ సమయంగా చెప్పవచ్చు. రాహువు మీకు ఎనిమిదో ఇంట్లో సంచరిస్తాడు. అటువంటి పరిస్థితిలో ఆరోగ్య పరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఖర్చులు కూడా పెరిగి ఇంటి సభ్యుల మధ్య డబ్బుతో కూడిన వ్యవహారాలు చిచ్చు పెట్టె ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు కాస్త జాగ్రత్త వహించడం మంచిది.
కన్యా రాశి.. అలాగే కన్యా రాశి వారికి రాహు గ్రహ సంచారం ప్రభావం చూపిస్తుంది. భాగస్వాములు, స్నేహితులు, సన్నిహితుల మధ్య ఉన్న బంధానికి బీటలు పడతాయి. అందుకే ఈ సమయంలో ఇతరులతో ప్రవర్తించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే గొడవలు ఏర్పడి విడిపోయే అవకాశం ఉంటుంది.