Laughing Buddha: లాఫింగ్ బుద్ధను ఈ దిశలో పెడితే చాలు.. ధన ప్రవాహమే?

మన చుట్టూ ఉన్న సమాజంలో రోజురోజుకీ వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ

  • Written By:
  • Publish Date - March 11, 2023 / 06:00 AM IST

మన చుట్టూ ఉన్న సమాజంలో రోజురోజుకీ వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ మధ్యకాలంలో చాలామందివాస్తు శాస్త్రాన్ని బాగానే విశ్వసిస్తూ ఉన్నారు. చాలామంది ఇంటి నిర్మాణం నుంచి ఇల్లు పూర్తయ్యే వరకు ఒక్క విషయంలో కూడా వాస్తు శాస్త్రాన్ని బాగా నమ్ముతున్నారు. అంతేకాకుండా వాస్తు శాస్త్రంలో చెప్పే పరిహారాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. కాగా వాస్తు శాస్త్రం అనుసరిస్తే ఎలాంటి సమస్య అయినా తొలగి పోతుంది. అందుకే వాస్తుశాస్త్రం సరిగ్గా చూసుకోవాలి. అయితే ఏ చిన్న లోపం ఉన్న కూడా ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది.

ఒకవేళ వీటిని అనుసరించక పోతే దరిద్రం మీ వెంటే ఉంటుంది. మరి మన జీవితంలో ఆర్ధిక, సామజిక, భావోద్వేగ సమస్యలకు సంబంధించిన పరిష్కారాల కోసం జ్యోతిష్య శాస్త్రంలో చిట్కాలు పరిహారాలు చెప్పబడ్డాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. లాఫింగ్ బుద్ధ గురించి మనందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరూ కూడా దీనిని ఇష్టపడుతూ ఉంటారు. లాఫింగ్ బుద్ధ చైనీస్ నాగరికత ఫెంగ్ షుయ్ నుండి వచ్చింది. ఇండియాలో కూడా లాఫింగ్ బుద్ద వాస్తు శాస్త్రంలో ప్రత్యేకంగా చూస్తారు. మన వాస్తు శాస్త్రంలో లాఫింగ్ బుద్ద ను ఆనందం, శ్రేయస్సుకు చిహ్నంగా భావించి ఇంట్లో పెట్టుకుంటారు. అయితే ఇంట్లో పెట్టుకోవడం అయితే పెట్టుకుంటాం. కానీ ఏ దిశలో పెట్టుకుంటే మంచి జరుగుతుంది అన్న విషయం చాలా మందికి తెలియదు.

ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. లాఫింగ్ బుద్ద ను భూమి నుండి కనీసం 30 అంగుళాల ఎత్తులో ఇంటి ద్వారం ముందు ఉంచాలి. మెయిన్ డోర్ ముందు లాఫింగ్ బుద్ద ను పెట్టడానికి కారణం మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మెయిన్ డోర్ తెరవగానే లాఫింగ్ బుద్దనే కనిపిస్తాడు. ఇలా పెడితే నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు. లాఫింగ్ బుద్ధ అనేది అదృష్టానికి చిహ్నం. దీనిని ఎప్పుడు వంటగది, డైనింగ్ ఏరియా, పడకగది లేదా టాయిలెట్ చుట్టూ ఉంచ కూడదు. అలా చేస్తే మీకు ఆర్ధిక కష్టాలు ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. అలాగే లాఫింగ్ బుద్ధ ఎప్పుడు నేలపై నేరుగా పెట్టకూడదు.