Camel Idols: ఇంట్లో ఒంటె విగ్రహం పెట్టుకుంటే బిజినెస్ లో మీకు తిరుగుండదు!

చాలామంది ఇంట్లో అలంకరణ కోసం అనేక రకాల వస్తువులను పెడుతూ ఉంటారు. ఏనుగుల ఫోటోలు,గుర్రాల ఫోటోలు,నక్కల ఫోటోలు, అలాగే విగ్రహాలు కూడా పెడుతూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - September 17, 2022 / 08:15 AM IST

చాలామంది ఇంట్లో అలంకరణ కోసం అనేక రకాల వస్తువులను పెడుతూ ఉంటారు. ఏనుగుల ఫోటోలు,గుర్రాల ఫోటోలు, నక్కల ఫోటోలు, అలాగే విగ్రహాలు కూడా పెడుతూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో పరిగెడుతున్న కళ్లెం వెయ్యని గుర్రాలను పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందట. ఇంట్లో ఒంటెల జతను పెట్టుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. మరి ఈ ఒంటెల జతను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంకా ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇంట్లో ఒంటి విగ్రహం ఉంటే శుభం కలుగుతుందని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. ఒంటె విగ్రహం ఇంట్లో ఉండడం వల్ల పనిలో పురోగతి అదే విధంగా విజయానికి మార్గంగా కూడా సూచిస్తారు. ఎందుకంటే ఉంటే కష్టతరమైన పరిస్థితులలో కూడా అవిశ్రాంతంగా పనిచేస్తుంది. అయితే ఇంట్లో రెండు ఒంటెల విగ్రహాలను ఉంచడం వల్ల వృత్తిలో విజయం లభించడమే కాకుండా డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారమవుతాయట.

ఇక ఒంటెల విగ్రహాలను ఎక్కడపడితే అక్కడ ఉంచకూడదు. వాటిని పెట్టడానికి కూడా సరైన దిశ కూడా ఉంది. మరి ఇంట్లో మనం రెండు ఒంటెల విగ్రహాలను ఎక్కడ పెట్టాలి అన్న విషయానికి వస్తే..డ్రాయింగ్ రూమ్ లేదా లివింగ్ రూమ్‌లో వాయువ్య దిశలో ఉంచాలట. ఇంట్లో ఒంటె విగ్రహాన్ని ఉంచడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అదే సమయంలో, ఒంటెల విగ్రహాలను జంటగా ఉంచినట్లయితే, అది ఇంటికి సంపదను తెస్తుంది. జంట ఒంటెల విగ్రహాలు ఇంటిని సిరి సంపదలతో తులతూగేలా చేస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.