Betel Leaves: ఆర్థిక నష్టాలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే తమలపాకుతో ఇలా చేయండి?

మామూలుగా మనం తమలపాకును ఎక్కువగా శుభకార్యాలలో వినియోగిస్తూ ఉంటాము. హిందువులు ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టిన కూడా అందులో తమల

  • Written By:
  • Publish Date - March 26, 2024 / 09:50 PM IST

మామూలుగా మనం తమలపాకును ఎక్కువగా శుభకార్యాలలో వినియోగిస్తూ ఉంటాము. హిందువులు ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టిన కూడా అందులో తమలపాకును మొట్టమొదటిగా ఉపయోగిస్తూ ఉంటారు. ఆధ్యాత్మికంగా తమలపాకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ తమలపాకును ఉపయోగించి కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒకవేళ మీరు కూడా ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే తమలపాకుతో ఇప్పుడు మేము చెప్పినట్టు చేస్తే చాలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే..

తమలపాకులతో అద్భుతమైన ప్రయోజనాలు తమలపాకులు ధనలక్ష్మికి ఎంతో ఇష్టమైనటువంటి ఆకులు. తమలపాకులకు పూజలలో ప్రముఖమైన స్థానం ఉంటుంది. అటువంటి తమలపాకులను భగవంతునికి నివేదిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా తమలపాకులను మంగళవారం లేదా శనివారం నాడు హనుమంతునికి సమర్పిస్తే, కోరుకున్న విజయాలు సాధించడానికి ఇది బాటలు వేస్తుంది. మంగళవారం లేదా శనివారం నాడు ఆంజనేయుడికి ఆకు పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి అని చెబుతారు. రోగాల నివారణ అవుతుందని, కష్టాలు తొలగిపోతాయి. కుటుంబంలో గొడవలు, చెడు దృష్టి ఉంటే తమలపాకు పరిహారాలు ఇవే ఇక అంతే కాదు తమలపాకులు వాడడం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి కూడా తొలగిపోతుందని చెబుతున్నారు.

ఎవరైనా తమ పై చెడు దృష్టి ఉందని భావిస్తే ఆరు గులాబీ రేకులను, తమలపాకులతో కలిపి తింటే చెడు దృష్టి పోతుందని చెబుతారు. అంతేకాదు కుటుంబంలో విభేదాలు తొలగిపోవాలంటే తమలపాకులతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల తొలగిపోతాయని చెబుతున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడూ విభేదాలు కొనసాగుతూ, ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గుతుంటే తమలపాకు మీద కర్పూరాన్ని పెట్టి కాలిస్తే మంచి ఫలితం ఉంటుంది. చాలా కాలంగా డబ్బు సమస్యలు ఉంటే ఒక తమలపాకును, రెండు లవంగాలను నేతిలో ముంచి పెనంపై పెట్టాలని, దానిని అగ్నితో కాల్చాలి. ఇలా చేస్తే దోషాలన్నీ పోయి ఆర్థిక ఇబ్బందులు తొలగి పోతాయి. చాలాకాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ విఫలమవుతుంటే అలాంటి వారు ఆదివారం బయటకు వెళ్లే సమయంలో మీ జేబులో లేదా పర్సులో తమలపాకులు పెట్టుకోవాలి. అప్పుడు మంచి సానుకూల ఫలితాలు వస్తాయి.

వ్యాపారం అభివృద్ధి చెందాలంటే తమలపాకు అవసరం లక్ష్మీదేవిని పూజించి, లక్ష్మీదేవి పూజ సమయంలో తమలపాకులను విశేషంగా పూజించి, ఆ తమలపాకులను మనం డబ్బు పెట్టుకునే చోట ఉంచుకుంటే, ఆర్థిక నష్టాల నుంచి బయటపడవచ్చు. ధనాకర్షణలో తమలపాకులు అద్భుతమైన రెమిడీగా పనిచేస్తాయని అంటున్నారు. ఇక పరమశివుడికి తమలపాకులను నివేదిస్తే కూడా కష్టాలు తొలగిపోతాయని అంటున్నారు. తమలపాకుతో పాటు ఒక రూపాయి నాణెం మన దగ్గర ఉంచుకోవటం వల్ల మంచి పాజిటివ్ శక్తి మన దగ్గర ఉంటుంది. దీంతో వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు లక్ష్మీ దేవి ఇంట్లో తాండవం చెయ్యాలి అంటే కచ్చితంగా దీపావళి నాడు లక్ష్మీ దేవికి పూజ చేసే సమయంలో తమలపాకులకు కూడా విశేషంగా పూజ చేసి, ఆపై ఆ ఆకులను జాగ్రత్తగా బీరువాలో పెట్టుకోవాలి.