Site icon HashtagU Telugu

Tirupati: తిరుపతిలో శ్రీ కోదండరామస్వామిలో వైభవంగా పుష్పయాగం

Ttd

Ttd

Tirupati: తిరుమల తిరుపతిలో పూజలు నిత్య కళ్యాణం.. పచ్చ తోరణంలా సాగుతుంటాయి. ప్రతినిత్యం ఏదో ఒక పూజ జరుగుతూనే ఉంటుంది. ప్రతి పూజకు ఓ విశిష్టత ఉంటూనే ఉంటుంది. తాజాగా తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం వార్షిక పుష్పయాగం నిర్వహించారు. ఉదయం ఉత్సవ దేవతలకు స్నపనం నిర్వహించగా, సాయంత్రం తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటకకు చెందిన దాతలు విరాళంగా ఇచ్చిన మూడు టన్నుల పదకొండు రకాల పూలతో పుష్పయాగం ప్రారంభమైంది.

కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నాగరత్న, ఉద్యానవన డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఏఈవో పార్థసారధి, సూపరింటెండెంట్, భక్తులు పాల్గొన్నారు. కాగా భక్తులు తిరుమలలో దర్శనం, వసతి బుకింగ్ కోసం http://t.tptblj.in/g సందర్శించండి.