Site icon HashtagU Telugu

Pulindindi : ప్రేమించినవారితో పెళ్లి కావాలా? ఈ గుడికి వెళ్లండి..

pulidindi venugopal swamy temple

pulidindi venugopal swamy temple

Pulindindi : ఒకరితో ప్రేమ.. మరొకరితో పెళ్లి.. ఇష్టం లేని జీవితాన్ని కష్టం గడిపేస్తున్న జంటలెన్నో ఉన్నాయి. ప్రేమించిన వారితో పెళ్లి అవ్వక, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోలేక.. తప్పని పరిస్థితుల్లో మరొకరి మెడలో మూడు ముళ్లు వేసినవారు, వేయించుకున్నవారెందరో ఉన్నారు. పెద్దలకోసం, కుటుంబం కోసం, కులం కోసం, పరువు కోసం ఇలా ఎన్నో కారణాలతో విడిపోయిన ప్రేమజంటలు చాలానే ఉన్నాయి. మీ జంట కూడా అలా విడిపోకుండా.. పెళ్లి బంధంతో కలకాలం కలిసి ఉండాలంటే ఈ ఆలయానికి ఒక్కసారి వెళ్లంది. ప్రేమ జంటలకే కాదు.. పెళ్లికాని సింగిల్స్ కూడా ఈ గుడికి వెళ్తే.. పెళ్లి అవుతుందట. ఇంతకీ ఏంటి ఆ ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాం.

శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించి ఎన్ని వర్ణనలున్నా.. ఎక్కడా ఆయనకు మీసాలున్నట్లు పురాణాలలో కనిపించదు. ఆ నల్లనయ్య మీసంతో కనిపించే ఆలయం మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. ఈ గుడిలో స్వామిని దర్శించుకున్న జంటలకు తప్పకుండా పెళ్లవుతుందన్న బలమైన నమ్మకం కూడా ఉంది.

ఇంత విశిష్ట ఉన్న ఆ మీసాల వేణుగోపాల స్వామి ఆలయం ఇప్పటి కోనసీమ జిల్లాలోని పులిదిండి గ్రామంలో ఉంది. పూతరేకులకు ఎంతో ఫేమస్ అయిన ఆత్రేయపురానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఈ గ్రామం వద్దే గోదావరి నది.. వశిష్ట, గౌతమి నదులుగా విడిపోతుంది. పచ్చని పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య ఉండే పులిదిండి గ్రామంలో మీసాల వేణుగోపాలుడు కొలువై ఉంటాడు. ఈ ఆలయానికి 300 ఏళ్ల చరిత్ర ఉంది. విష్ణుమూర్తి కుడిచేతిలో చక్రం, ఎడమచేతిలో శంఖం ఉంటాయి. కానీ.. ఇక్కడ అందుకు భిన్నంగా కుడిచేతిలో శంఖాన్ని, ఎడమచేత చక్రాన్ని ధరించి దర్శనమిస్తాడు.