Prayer: పూజ చేసేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి…!

ప్రతి ఇంట్లో దీపారాధనతోపాటుగా దేవుడికి పూజ చేస్తుంటారు. మంత్రాలు జపిస్తూ...పూలు, పండ్లు, పాటు, చక్కెర సమర్పిస్తారు. అయితే పూజకు చేసేందుకు కొన్ని నియమాలు ఉంటాయి.

  • Written By:
  • Publish Date - February 3, 2022 / 12:14 PM IST

ప్రతి ఇంట్లో దీపారాధనతోపాటుగా దేవుడికి పూజ చేస్తుంటారు. మంత్రాలు జపిస్తూ…పూలు, పండ్లు, పాటు, చక్కెర సమర్పిస్తారు. అయితే పూజకు చేసేందుకు కొన్ని నియమాలు ఉంటాయి. ఎలా పడితే అలా పూజ చేయకూడదు. ఓ పద్దతి ప్రకారం…పూజించాలి. అంతేకానీ మనం తెలిసి తెలియక చేసే కొన్ని పారపాట్లు చేస్తుంటాం. ఆ పొరపాట్లను ఎలా సవరించుకోవాలో తెలుసుకుందాం.
1.దూపం..: దేవుడికి పూజ చేసే సమయంలో అగరబత్తీలు వెలిగిస్తాం. పొగవచ్చేందుకు వాటిని నోటితో ఊదుతారు. కానీ అలా చేయకూడదు. వెలిగించిన తర్వాత వాటిని అలాగే వదిలేయాలి. నోటితో ఆర్పేస్తే దోషం జరిగే ప్రమాదం ఉంటుందట.
2. ఇక భోజనం చేసిన తర్వాత …పూజ అస్సలు చేయకూడదు. ఘనపదార్థాలు తీసుకోకముందు మాత్రమే పూజ చేయాలి. ఎందుకంటే మనం భోజనంలో ఉల్లిపాయలు, ఇతర ఆహార పదార్థాలను తీసుకుంటుంటాం. ఆ వాసన నోటిలోనే ఉండిపోతుంది. ఆ నోటితోనే మంత్రార్చన అస్సలు చేయకూడదట. కాబట్టి శుభ్రంగా స్నానం చేసిన తర్వాత పూజ చేయాలి.
3. దేవుడికి పూజ చేస్తున్న సమయంలో చిరిగిన దుస్తువులు ధరించకూడదు. చిరిగిన దుస్తువులు ధరించడం దరిద్రానికి సంకేతం. కాబట్టి శుభ్రంగా ఉన్న దుస్తువులను ధరించి పూజించాలి.
4. చాలా మంది దేవుడికి పూలల్లో తులసి ఆకులను కలిపి పూజిస్తుంటారు. అలా తులసితో పూజించడం శుభసూచికగా భావిస్తారు. కానీ వినాయకుడికి తులసి పెట్టకూడదు. వినాయకుడికి తులసి ఆకులతో ఎట్టి పరిస్థితుల్లో పూజలు చేయరాదు.
5. తులసి ఆకులను స్నానం చేయకుండా మొక్క నుంచి కోయరాదు. స్నానం చేయకుండా కోసినట్లయితే దేవుడు అంగీకరించడట. అదేవిధంగా ఆదివారం రోజున తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు. అలా చేసినట్లయితే ఇంటికి మంచిది కాదు.
6. శివుడికి కేతకీ పుష్పాన్ని పెట్టకూడదు. కార్తీక మాసంలో విష్ణుమూర్తికి ఈ పుష్పంతో పూజించినట్లయితే అంతా మంచిది జరుగుతుంది.
7.నెయ్యితో దీపాలు వెలిగించడం సాధారణం. కానీ గడ్డకట్టిన నెయ్యిని దేవుడికి సమర్పించకూడదు.
8. ఒక దీపం నుంచి మరొక దీపాన్ని వెలిగించకూడదు. అలా చేస్తే అనారోగ్యం, పేదరికాన్ని ఆహ్వానించినట్లవుతుంది. దీపాన్ని దక్షిణం వైపు వెలిగించరాదు.
9.లక్ష్మీ పూజను శ్రావణ నక్షత్రంలోకానీ లేదా బుుతిక తిథిలో కానీ పూజించకూడదు.
10. పూజ్యమైన ఆరాధన సమయంలో గౌరవప్రదమైన వ్యక్తి వస్తే…అతన్ని విస్మరించకూడదు. వారిని అభినందిస్తూ పూజను కొనసాగించడమే ఆరాధన.