Shani Pooja: శనిదేవుని జయంతి రోజున ఈ వస్తువులను దానం చేస్తే…మీ కష్టాలన్నీ తొలగిపోతాయి..!!

  • Written By:
  • Publish Date - May 27, 2022 / 06:30 AM IST

శనిదోషం…ఈ పదాన్ని హిందువులు తరచుగా వింటూనే ఉంటారు. ఇప్పటికీ చాలామంది తమ జాతకంలో ఏలినాటి శనిదోషం ఉందని…తమ పనులేవీ పూర్తికావడం లేదని బాధపడుతుంటారు. అలాంటివారికోసం శనిదేవును అనుగ్రహం పొందేందుకు…ఏలినాటి శని నుంచి విముక్తి పొందాలంటే ఈ ఏడాది మే మాసంలో ఓ ప్రత్యేక సందర్భం ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం 2022 మే 30వ తేదీన శని జయంతి వచ్చింది. జ్యేష్టమాసంలో అమావాస్య 29మే 2022 మధ్యాహ్నం 2:54 గంటలకు ప్రారంభమై 30 మే సాయంత్రం 4గంటల 59మినిషాలకు ముగుస్తుంది. అందుకే ఈ ఏడాది శనిజయంతిని మే 30వ తేదీని అంటే సోమవారంనాడు ఉదయం జరుపుకుంటారు. శాస్త్రాల ప్రకారం సూర్యుని కుమారుడే శనిదేవుడు. శనిదేవుడే కాకుండా ఆయనకు ఛాయా పుత్రుడు అనే కూడా ఉంది.

కాగా జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపించబతున్నారో అని నిరూపించడానికి ఆయన జననం సూర్యగ్రహణంలో జరిగింది. ఈ రోజున శనిదేవుని పూజించినట్లయితే శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్మకం. అయితే శని జయంతి రోజున ఈ వస్తువులను దానం చేస్తే మీ కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఆనందం, సంత్రుప్తిని పెంచుకోవచ్చు. అంతేకాదు బాధల నుంచి కూడా విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. కాగా శనిజయంతి రోజున ఎలాంటి వస్తువులు దానం చేయాలో తెలుసుకుందాం.

పేదలకు దానం:
శనిజయంతి రోజున…శనిదేవుడికి పూజ చేసిన అనంతరం నల్లని నువ్వులు పేదలకు దానం చేయాలి. ఇలా చేస్తే…సాడేసతి, శని దహియ, శనిదోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు రాహు, కేతువుల దుష్పరిణామాల బారి నుంచి తప్పించుకోవచ్చు.

దుస్తువులు:
శని జయంతి రోజున మీ సామర్థ్యానికి తగ్గట్లుగా పేదలకు నల్లరంగులో లేదా నీలిరంగులో ఉండే వస్త్రాలను, చెప్పులను దానం చేయాలి. ఇలా చేస్తే రోగాలు, శారీరక బాధలు దూరమవుతాయని పండితులు చెబుతున్నారు.

డబ్బు సమస్యలు తొలగిపోవాలంటే:
మీకు ఇప్పటివరకు ఏవైనా ఆర్థిక సమస్యలు ఉంటే..శనిజయంతి రోజున పావుకిలో ఉల్లిపాయలను పేదలకు దానం చేయండి. ఇలా చేస్తే..మీకు ఆర్థిక సంక్షోభం నుండి విముక్తి లభిస్తుంది. మీ సంపద, శ్రేయస్సు కూడా పెరుగుతుంది. వీటితోపాటుగా గోధుమలను కూడా దానం చేస్తే ఆర్థికంగా బలపడతారు.

శనిదోషం పోవాలంటే:
ఎవరి జాతకంలో అయితే ఏలినాటి శని ఉంటుందో…వారందరూ శని జయంతి రోజున ఆవాల నూనె లేదా నువ్వుల నూనెలను దానం చేయాలి. శని మహాదశ కష్టాల నుంచి ఉపశమనం పొందాలంటే పేదలకు ఇనుము, గొడుగు, స్టీల్ వంటి పాత్రలను దానం చేసినట్లయితే మనశ్శాంతి లభిస్తుంది.

శని అనుగ్రహం కోసం:
శని జయంతి రోజున నిరాశ్రుయులకు సేవ చేయడం ద్వారా…వారికి సహాయం చేసినట్లయితే…మీరు శని దేవుని ప్రసన్నం చేసుకుని…అనుగ్రహం పొందడానికి అవకాశం ఉంటుంది. నల్లని ఉద్ది పప్పును పిండిగా చేసి చేపలకు ఆహారంగా తినిపించినట్లయితే శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది.