Site icon HashtagU Telugu

TTD: తిరుమలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం: టీటీడీ చైర్మన్

Tirumala Tirupati Devastanam Ttd

Tirumala Tirupati Devastanam Ttd

TTD: శ్రీవారి భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారికి మరింత సౌకర్యవంతమైన వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది టీటీడీ. టీటీడీ అచ్చుతం, శ్రీపథం వసతి సముదాయాలను నిర్మిస్తోంది. ఈ మేరకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి (2), శ్రీ కోదండరామస్వామి (3) సత్రాల స్థానంలో అచ్చుతం, శ్రీపథం వసతి సముదాయాలను నిర్మించేందుకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి కలిసి శంకుస్థాపన చేశారు.

సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీవారి దర్శనం, అన్నప్రసాదం, బస తదితర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. మరింత మెరుగ్గా బస కల్పించడంలో భాగంగా తిరుమల, తిరుపతిలో ఉన్న విశ్రాంతి గృహాల్లో అవసరమైన వాటిని ఆధునీకరిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఇందులో భాగంగా తిరుపతిలో దాదాపు 70 ఏళ్ల క్రితం నిర్మించిన‌ శ్రీ గోవిందరాజస్వామి సత్రం (రెండో సత్రం) స్థానంలో రూ.209 కోట్ల‌తో అచ్యుతం, శ్రీ కోదండరామస్వామి సత్రం(మూడో సత్రం) స్థానంలో రూ.209 కోట్లతో శ్రీపథం వసతి సముదాయాలు నిర్మించాల‌ని టీటీడీ నిర్ణయించిందని చెప్పారు. ఒక్కో బ్లాక్‌లో 4,100 మంది చొప్పున మొత్తం 8,200 మంది ఇక్కడ బస చేసే అవకాశాలు ఉంటాయన్నారు.