Site icon HashtagU Telugu

Mahakumbh Mela Stampede : అఖాడా పరిషత్ కీలక నిర్ణయం

Akhil Bharatiya Akhara Pari

Akhil Bharatiya Akhara Pari

ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి జరిగే మహా కుంభమేళా(Mahakumbh Mela Stampede)లో తీవ్ర విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నేడు మౌని అమావాస్య (Mauni Amavasya) సందర్భంగా లక్షలాది భక్తులు సంగమం వద్ద పుణ్యస్నానం చేయడానికి రాగా..అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లు విరిగిపోవడంతో తొక్కిసలాట సంభవించింది. ఈ ఘటనలో 15 మంది మరణించగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

Thyroid During Pregnancy : గర్భిణీ స్త్రీలలో థైరాయిడ్, పుట్టిన తర్వాత పిల్లలపై ప్రభావం ఉంటుందా..?

ఈ ఘటన నేపథ్యంలో అఖాడా పరిషత్ కీలక నిర్ణయం తీసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాలు ఆచరించాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకుంటున్నట్లు పరిషత్ అధ్యక్షుడు రవింద్ర పూరి వెల్లడించారు. వసంత పంచమి రోజున స్నానానికి రావాలని విజ్ఞప్తి చేసారు. “ఈ సంఘటన జరిగినందుకు మేము బాధపడుతున్నాము. వేలాది మంది భక్తులు మా వెంట ఉన్నారు… ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ రోజు స్నానంలో అఖాడా పరిషత్ పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాం. ప్రజలకు నా విజ్ఞప్తి, ఈ రోజు కాకుండా వసంత పంచమి రోజు స్నానానికి రావాలి” అని పేర్కొన్నారు.

ఇక తొక్కిసలాట ఘటన పై జాతీయ నేతలు స్పందింస్తూ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ..మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మేనేజ్‌మెంట్ కంటే సెల్ఫ్ ప్రమోషన్‌పై దృష్టి పెట్టడమే ఘటనకు కారణమన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఇలాంటి వ్యవస్థ ఉండడం ఖండించవలసిన విషయమన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు రాహుల్.ఈ ఘటనపై మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ రియాక్ట్ అయ్యారు. భక్తులు మరణించిన వార్త చాలా బాధాకరమన్నారు. తీవ్రంగా గాయపడిన వారిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఉత్తమ ఆసుపత్రులకు తరలించి తక్షణ వైద్య సహాయం చేయాలన్నారు. మృతులను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించాలన్నారు.