Srisailam: శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు, ఏర్పాట్లు సిద్ధం

  • Written By:
  • Publish Date - January 11, 2024 / 01:10 PM IST

Srisailam: మకర సంక్రమణ పుణ్యకాలన్ని పురస్కరించుకొని శ్రీశైలంలో జనవరి 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని దేవస్థానం ఈవో పెద్ది రాజు తెలిపారు. పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 18న ముగుస్తాయని… ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించి మల్లికార్జునస్వామికి ఏటా రెండు సార్లు.. సంక్రాంతికి,శివరాత్రికి దేవస్థానం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.

ఈ సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 12 న ఉదయం 8.30 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు అంకురార్పణ అగ్ని ప్రతిష్టాపన 7 గంటలకు ధ్వజారోహణ సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజపటం అవిష్కరిస్తామని అధికారులు తెలిపారు.

బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన రెండోరోజు నుంచి శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రతిరోజు సాయంత్రం విశేషపూజలు, వాహనసేవలు నిర్వహిస్తామన్నారు. ఉత్సవాల సందర్భంగా ఈ నెల 12 నుంచి 18 వరకు ప్రత్యక్ష, పరోక్ష సేవలైన రుద్రహోమం, చండీ హోమం, మృత్యుంజయహోమం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కళ్యాణం, శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణం, ఏకాంత సేవలు తాత్కాలిక నిలుపుదల చేస్తామని ఆలయ ఈవో తెలిపారు. ఈనెల 15వ తేదీ మకర సంక్రాంతి పురస్కరించుకొని స్వామి అమ్మవారికి బ్రహ్మోత్సవ కళ్యాణం, అలాగే మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు భాగంగా చిన్న పిల్లలకు భోగి పండ్లు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తునట్లు ఈవో పెడ్డిరాజు తెలిపారు.