మామూలుగా మనం పెద్ద జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్ని కొన్ని సార్లు పొరపాట్లు జరగడం అన్నది కామన్. అనుకోకుండా మనకు తెలియకుండానే తప్పులు జరగడం మన చేతిలోని వస్తువులు చేయిజారి కింద పడిపోవడం ఎవరైనా తగిలించినప్పుడు వస్తువులు చేయి జారీ కింద పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అంతే అయితే ఇలాంటివి కొన్నిసార్లు అనుకోకుండానే యాక్సిడెంట్ గా జరుగుతూ ఉంటాయి. కానీ కొన్ని రకాల వస్తువులు చేయి జారీ కింద పడితే అశుభం జరుగుతుంది అని చెబుతున్నారు. మరి ఎలాంటి వస్తువులు చేయి జారి కింద పడకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఉప్పు మనం వంట చేసేటప్పుడు లేదంటే ఏదైనా ఆహార పదార్థాలలో వినియోగించేటప్పుడు అనుకోకుండా చేయి జారి కింద పడిపోతూ ఉంటుంది. అయితే ఇలా ఉప్పు కింద పడటం అన్నది ఆ శుభంగా భావించాలట. ఇది జాతకంలో చంద్రుడు శుక్రుడు ఏ విధంగా ఉన్నారు అని తెలిపే సూచన అని చెబుతున్నారు. అంతే కాకుండా వైవాహిక జీవితంలో రాబోయే సమస్యలకు ప్రతీకగా కూడా భావించాలని చెబుతున్నారు. అంతే కాకుండా ఉప్పు లక్ష్మి దేవితో సమానం. ఉప్పు కింద పడితే ఆర్థిక సమస్యలు కూడా తలెత్తుతాయట. అలాగే పదేపదే కుంకుమ చేజారి కిందపడి పోవడం కూడా అశుభానికి సంకేతంగా భావించాలట.
ఇలా జరగటం వల్ల భార్య, భర్తల దాంపత్య జీవితంలో గొడవలు జరిగి వారు, విడిపోతారని తెలిపే సూచన అని పండితులు చెబుతున్నారు. అలాగే ఆవనూనె ఒలికి పోవడం అన్నది అపశకునంగా భావించాలట. ఆవ నూనె కింద పడిపోతే శని దృష్టి ప్రభావం పడి జీవితంలో సమస్యల ఎదురవుతాయట. అయితే ఇలా జరిగినపుడు పరిహారంగా శని పూజ చేసుకొని శని దేవుడి అనుగ్రహం పొందాలని చెబుతున్నారు. అలాగే పాలు నేలపాలు అవ్వడం పాల గిన్నె పడిపోవడం లాంటివి అపశకునంగా పరిగణించాలట. జాతక చక్రంలో చంద్రుడి కదలికలు లేదా చంద్ర దశ సరిగా లేకపోతే ఇలాంటి అపశకునం జరుగుతుందని చెబుతున్నారు.