Srikrishna Unknown Facts: శ్రీకృష్ణుని గురించి ఎవరికీ తెలియని విషయాలు!

శ్రీకృష్ణుడు 5,252 సంవత్సరాల క్రితం జన్మించాడు. పుట్టిన తేది. 18.07.3228 (క్రీస్తుపూర్వం 3228 )

  • Written By:
  • Publish Date - August 19, 2022 / 01:31 PM IST

1. శ్రీకృష్ణుడు 5,252 సంవత్సరాల క్రితం జన్మించాడు
2. పుట్టిన తేది. 18.07.3228 (క్రీస్తుపూర్వం 3228 )
3. మాసం : శ్రావణం
4. తిథి: అష్టమి
5 . నక్షత్రం : రోహిణి
6. వారం : బుధవారం
7. సమయం : రాత్రి గం.00.00 ని.
8 జీవిత కాలం : 125 సంత్సరాల 8 నెలల 7 రోజులు
9. నిర్యాణం: 18.02.3102(క్రీస్తుపూర్వం 3102)
10. శ్రీకృష్ణుని 89వ యేట కురుక్షేత్రం జరిగినది
11 కురుక్షేత్రం జరిగిన 36సం. తరువాత నిర్యాణం
12. కురుక్షేత్రం. 08.12.3139(క్రీస్తుపూర్వం)న మృగసిర శుక్ల ఏకాదశినాడు ప్రారంభమై 25.12.3139 న ముగిసినది. 21.12.3139న 3గం. నుంచి 5గం.లవరకు సంభవించిన సూర్య గ్రహణం జయద్రదుని మరణానికి కారణమయ్యెను.
13. భీష్ముడు. 02.02.3138న ఉత్తరాయణంలో మొదటి ఏకాదశినాడు ప్రాణము విడిచాడు.

14. శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు. అవి:
మధురలో కన్నయ్య
ఒడిశాలో జగన్నాధ్
మహారాష్ట్ర లో విఠల (విఠోబ)
రాజస్తాన్ లో శ్రీనాధుడు
గుజరాత్ లో ద్వారకాదీసుడు & రాంచ్చోడ్
ఉడిపి, కర్ణాటకలో కృష్ణ
15. జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు
16. జన్మనిచ్చిన తల్లి దేవకీ
17. పెంచిన తండ్రి నందుడు
18. పెంచిన తల్లి యశోద
19. సోదరుడు బలరాముడు
20. సోదరి సుభద్ర
21. జన్మ స్థలం మధుర
22. భార్యలు : రుక్మిణీ, సత్యభామ, జాంబవతీ, కాళింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్ష్మణ
23. శ్రీ కృష్ణుడు జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే హతమార్చినట్టు సమాచారం. వారు : చాణుర – కుస్తీదారు
కంసుడు – మేనమామ
శిశుపాలుడు మరియు దంతవక్ర – అత్త కొడుకులు

24. శ్రీకృష్ణుని జీవితం కష్టాల మయం. తల్లి ఉగ్ర వంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందిన వారు.
25. శ్రీ కృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరముతో పుట్టాడు. గోకులమంతా నల్లనయ్య / కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నారని శ్రీ కృష్ణుడుని అందరూ ఆటపట్టిస్తూ, అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది.
26. కరువు, ఇంకా అడవి తోడేళ్ళ ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనం కి మారవలసి వచ్చింది.
27. 14-16 ఏళ్ల వయసు వరకు బృందావనంలో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14-16 వయస్సులో మధురలో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు.

28. తను మళ్ళీ ఎప్పుడూ బృందావనానికి తిరిగి రాలేదు.
29. కాలయవన అను సింధూ రాజు నుంచి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారకాకి వలస వెళ్ళవలసి వచ్చింది.
30. వైనతేయ తెగకు చెందిన ఆటవికులు సహాయంతో జరాసందుడిని గోమంతక కొండ (ఇప్పటి గోవా) వద్ద ఓడించాడు.
31. శ్రీకృష్ణుడు ద్వారకాను పునర్నిర్మించారు.
32. అప్పుడు విద్యాభ్యాసం కొరకు 16-18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క అశ్రమంకు తరలివెళ్ళెను.
33. గుజరాత్ లో గల ప్రభాస అను సముద్రతీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురైన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్త ను కాపాడాడు.
34. తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకుని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరి అగు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి చేశాడు. ఇందులో చాలా క్రియాశీలంగా వ్యవహరించాడు.
35. పాండవులతో ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేయించి రాజ్యమును స్థాపించజేసాడు.
36. ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడాడు.
37. రాజ్యము నుండి వెడలగొట్టునపుడు పాండవులకు తోడుగా నిలిచాడు.
38. పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయమును వరించునట్టు చేశాడు.
39 ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారక నగరము నీట మునిగిపోవుట స్వయముగా చూశాడు.
40. అడవిలో జర అను వేటగాడి చేతిలో మరణించాడు.
41. శ్రీకృష్ణుడు జీవితం విజయవంతమైనదేమీ కాదు. జీవితములో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతముగా గడిపినది లేదు. జీవితపు ప్రతీ మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు.
43. జీవితములో ప్రతీ వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి / ఎవరికీ అంకితమవ్వలేదు.
అతను గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు ఐనప్పటికీ తను ఎప్పుడు వర్తమానములోనే బ్రతికాడు.
44. శ్రీకృష్ణుడు జీవితము మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ ఆయన జీవితం జీవన విదానం….