Site icon HashtagU Telugu

Spirtual: పూజ చేసేటప్పుడు ఇలాంటి నియమాలు పాటిస్తే చాలు.. ఆర్థిక, ఐశ్వర్య వృద్ధి కలగడం ఖాయం!

Spirtual

Spirtual

మామూలుగా చాలా మంది దేవుడికి పూజ చేసేటప్పుడు తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాటి వల్ల పూజ చేసిన ఫలితం కూడా దక్కదు అని చెబుతున్నారు పండితులు. ఇంతకీ పూజ చేసేటప్పుడు ఎలాంటి విషయాలను గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామూలుగా ప్రతి ఒక్కరు ఆర్థిక పరిస్థితులు బాగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని కోరుకుంటూ ఉంటారు. అందుకోసం ఎన్నో పూజలు పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. అయితే ప్రతి పౌర్ణమి రోజు రావి ఆకు మీద శ్రీరామ అని రాసి దానిమీద ఒక సెనగ లడ్డు ఉంచి హనుమంతుడు ఆలయంలో సమర్పించాలట.

ఈ విధంగా చేస్తే ఐశ్వర్యం తప్పకుండా కలుగుతుంది అని చెబుతున్నారు పండితులు. అదేవిధంగా ప్రతి ఆదివారం రోజు ఆవుకి తప్పకుండా బెల్లం తినిపించాలట. అలాగే బుధవారం రోజు ఆకలితో ఉన్న వ్యక్తికి భోజనం పెట్టాలని ఇది ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల త్వరలోనే ఇల్లు భూమి కొనుగోలు చేస్తారట. ప్రతి శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్లాలట. ఆలయంలో కూర్చొని మూడు లవంగాలు చేతిలో పట్టుకొని ఓం శ్రీం అని 108 సార్లు జపించాలట. ఆ తర్వాత ఆ లవంగాలను తీసుకొని తినాలట. ఈ విధంగా చేస్తే ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చు అని చెబుతున్నారు.

అలాగే ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇంటి ఇల్లాలు ప్రవేశద్వారం వద్ద నీళ్లు ఆరబోయారట. ఆ తర్వాత నీళ్లలో ఉప్పు వేసి ద్వారానికి రెండు వైపులా చల్లాలట. ప్రతీ అమావాస్య రోజు ఇల్లు దులిపి పూజా మందిరంలో ధూపం వేయాలట. ఇలా చేస్తే ఆర్థికంగా స్థిరపడటం ఖాయం అని చెబుతున్నారు.. ఇంట్లోని పూజా మందిరంలో ఎత్తైన విగ్రహాలు ఉండకూడదు. కేవలం ఇంటి యజమాని బొటనవేలు ఎత్తులో మాత్రమే ఉండాలని చెబుతున్నారు. అలాగే ఇష్ట దైవానికి ప్రతిరోజు దీపారాధన చేయాలట. చాలామంది దీపం వెలిగించేటప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు. దీపారాధన చేసేటప్పుడు ముందుగా నూనె పోసిన తర్వాతే వత్తులను వేయాలట. అనంతరం దీపం వెలిగించాలని చెబుతున్నారు. దేవుడికి పూజించిన తర్వాత ఆ పూలను తీసి ఎక్కడబడితే అక్కడ వేయకూడదట. జనాలు నడిచే ప్రదేశంలో అసలే వేయకూడదట. కాబట్టి ఒక చిన్న టబ్బులో వేయాలట. అందులో కాసిన్ని నీళ్లు, మట్టి, పసుపు వేయాలట. ఆ తర్వామ మూడు లేదా నాలుగు రోజులకు వాటిని పూల చెట్ల మొదళ్లలో వేయాలట. ఇలా చేస్తే భగవంతుడిని అభిషేకించిన పూలు అపవిత్రం కాకుండా ఉంటాయట. అంతేకాకుండా చెట్లకు చక్కటి ఎరువులా పనిచేసి, మంచిగా పూలు పూస్తాయని చెబుతున్నారు.