Shivlingam Rules : ఇంట్లో శివలింగాన్ని పూజిస్తున్నారా?…ఇలా చేయకండి…శివుడి ఆగ్రహానికి గురవుతారు..!!

హిందూసంప్రదాయం ప్రకారం ప్రతిఒక్కరూ ఇళ్లలో పూజలు చేస్తుంటారు. ఎవరికి ఇష్టమైన దైవాన్ని వారు పూజిస్తుంటారు. అయితే కొందరు ఇంట్లోని పూజాగదిలో శివలింగాన్ని ఉంచి పూజలు చేస్తుంటారు.

  • Written By:
  • Publish Date - June 23, 2022 / 06:30 AM IST

హిందూసంప్రదాయం ప్రకారం ప్రతిఒక్కరూ ఇళ్లలో పూజలు చేస్తుంటారు. ఎవరికి ఇష్టమైన దైవాన్ని వారు పూజిస్తుంటారు. అయితే కొందరు ఇంట్లోని పూజాగదిలో శివలింగాన్ని ఉంచి పూజలు చేస్తుంటారు. అలాంటివారు కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. లేదంటే ఆర్థికంగా,మానసికంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.

ఆధ్యాత్మిక చింతన ప్రతిఒక్కరిలో ఉంటుంది. కొందరు ఇంట్లో పూజలు చేస్తుంటే…మరికొందరు ప్రతిరోజూ గుడికి వెళ్లి దేవుడిని నమస్కరించుకుంటారు. ఇళ్లలో దేవతల పూజలు చేస్తే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నమ్ముతుంటారు. దీంతోపాటు పూజించేటప్పుడు కొన్ని ప్రత్యేక పద్దతులు ఉంటాయి. వాటిని తెలుసుకుని పాటించాల్సి ఉంటుంది. లేదంటే కష్టాలు ఎదర్కొవల్సి ఉంటుంది. అదే సమయంలో ఇంట్లో శివలంగాన్ని పూజిస్తే కొన్ని పద్దతులు పాటించాలి. లేదంటే శివుడి ఆగ్రహానికి గురికావల్సి ఉంటుంది.

శివలింగాన్ని ఉంచి ప్రదేశంలో ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. పూజస్థలంలో పరిసరాల్లో చెత్తలేకుండా జాగ్రత్తపడాలి. ఇంట్లో ఉండే శివలింగం ఆకారం కూడా చేతి బొటనవేలు కంటే పెద్దదిగా ఉండకూడదు. ఇంట్లో ఉండే శివలింగంపై పసుపు లేదా సింధూరం పూయకూడదు. శివునికి ఎప్పుడూ చందనమే వాడాల్సి ఉంటుంది. సింధూరం సౌభాగ్యానికి ప్రతీక. శివుడు వినాశనపు దేవుడు. అందుకే సింధూరం పూస్తే జీవితంలో కష్టాలు ఎదురువుతాయి. ఇక శివలింగం బంగారం, వెండి, స్పటికం లేదా ఇత్తడిది ఉంటే మంచిది. రాగి శివలింగాన్ని ఇంట్లో ఎప్పుడూ స్థాపించకూడదు.

ఇక శివలింగానికి పూజలు చేసేటప్పుడు తులసి ఆకులు సమర్పించకూడదు. అదేవిధంగా చంపా పూలు కూడా శివుడికి పెట్టకూడదు.